Heart Attack: ఇటీవల కాలంలో ఎవరికీ ఎప్పుడు ఏరకంగా మృత్యువు ముంచుకొస్తోందో అర్ధం కావడంలేదు . యుక్త వయసులోనే గుండె నొప్పితో అకస్మాత్తుగా మరణించడం ఎక్కువగా జరుగుతోంది . తాజాగా కేపీహెచ్బీ కాలనీలో ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. షాపింగ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు . . అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు . వివరాలు ఇలా ఉన్నాయి . .
Heart Attack: షాపింగ్ కోసం వచ్చి గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మక్తల్ గ్రామానికి చెందిన, కలాల్ ప్రవీణ్ కృష్ణ(37) తన భార్య పిల్లలతో కలిసి ప్రగతి నగర్ రాజీవ్ గృహలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం కె.పి.హెచ్.బి కాలనీలోని ఓ లో దుస్తుల దుకాణంలో షాపింగ్ కి వెళ్ళాడు. షాపింగ్ చేస్తూ ఒకసారిగా స్పృహ తప్పి కింద పడిపోవడంతో సిబ్బంది, అతడికి సీపీఆర్ చేసి, స్థానిక ఆసుపత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు…
ఆ యువకుడు కుప్పకూలిపోతున్న దృశ్యం ఇక్కడ వీడియోలో చూడొచ్చు :