Yogi Adityanath: యూపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు సోమవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ – 1947 నుంచి సంభాల్‌లో జరిగిన అల్లర్లలో 209 మంది హిందువులు మరణించారు. ఒక్కసారి కూడా ఆ అమాయకుల పట్ల సానుభూతి వ్యక్తం చేయలేదు. ఇటీవల జరిగిన సంభాల్ అల్లర్లతో ఇంతమంది కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వ్యక్తులు సామరస్యం గురించి మాట్లాడతారు. సిగ్గుపడాలి అంటూ వ్యాఖ్యానించారు. .
ఈ సందర్భంగా ఆయన గతంలో జరిగిన ప్రతి అల్లరినీ లెక్కలతో సహా వివరించారు. 2017 నుండి ఇప్పటి వరకు, రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు 97 నుండి 99 శాతం తగ్గాయని యోగి చెప్పారు. 2017 నుంచి యూపీలో ఎలాంటి అల్లర్లు జరగలేదన్నారు. 2012 నుండి 2017 వరకు అప్పుడు SP ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో 815 మతపరమైన అల్లర్లు – 192 మరణాలు జరిగాయి. 2007-2011 మధ్య 616 మతపరమైన సంఘటనలు జరిగాయి, వాటిలో 121 మంది మరణించారు.
ఇది కూడా చదవండి: Cold Weather: చలితో వణికిపోతున్న ఉత్తరాది.. దక్షిణాదికి వర్ష సూచన
Yogi Adityanath: సంభాల్‌లో వాతావరణం చెడిపోయింది. 1947 నుండి నిరంతర అల్లర్లు జరిగాయి. 1947లో ఒక మరణం, 1948లో 6 మరణాలు సంభవించాయి. 1958-1962లో అల్లర్లు, 1976లో 5 మంది చనిపోయారు. 1978లో 184 మంది హిందువులను సామూహికంగా దహనం చేశారు. కొన్ని నెలలపాటు నిరంతరాయంగా కర్ఫ్యూ విధించారు. 1980-1982లో అల్లర్లు మరియు ఒక్కొక్కరు మరణించారు. 1986లో 4 మంది చనిపోయారు. 1990-1992లో ఐదుగురు, 1996లో ఇద్దరు మరణించారు. ఈ క్రమం నిరంతరం కొనసాగింది అంటూ శాసనసభలో ప్రతిపక్షాలు చేస్తిన ఆరోపణలకు సమాధానంగా లెక్కలు చెప్పారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్.