AP Politics

AP Politics: పిఠాపురం తమ్ముళ్లని రెచ్చగొట్టే పనిలో వైసీపీ

AP Politics: టీడీపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠకు తెరపడిరది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు తర్వాత మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. పొత్తు ధర్మం పాటిస్తూ జనసేన, బీజేపీలకు చెరో ఎమ్మెల్సీ కేటాయించారు. ఇక మిగిలన మూడు స్థానాలకు టీడీపీలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో.. ఆవావహులకు నిరాశ ఎదురైనా సరే.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎవరూ తప్పు పట్టలేని విధంగా నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇంతకీ బాబు ఫాలో అయిన సెలక్షన్‌ మోడల్‌ ఏంటి? బాబు తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నేతలు తీవ్ర నిరాశలో పడ్డారెందుకు? ఈ స్టోరీలో చూద్దాం.

కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్సీలుగా యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్‌బాబు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు పదవీకాలం ముగియనుండటంతో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదుగురిలో బీటీ నాయుడికి మాత్రమే పొడిగింపు లభించింది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుండగా..

ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున కొణిదెల నాగబాబు నామినేషన్‌ కూడా వేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో.. బీజేపీకి ఒక స్థానం కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. 

ఈ సారి బీజేపీకి ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయిని.. వాటిలో ఛాన్స్‌ ఇస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పమన్నారంటూ ఆశావహులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ఫోన్‌ చేసి సర్ది చెప్పారు. ఆ కొద్ది సేపటికే పార్టీ అధిష్టానం ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్రతోపాటు కర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు. 

అభ్యర్థుల ఎంపికలో ప్రాంతాల మధ్య సమతూకం పాటించారు. ఉత్తరాంధ్ర నుంచి ఎస్సీ, యువత కోటాలో కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చారు. రాయలసీమ నుంచి బీసీ వర్గానికి చెందిన బీటీ నాయుడుకు, కోస్తా జిల్లాల నుంచి బీసీ వర్గానికి చెందిన బీదా రవిచంద్రను ఎంపిక చేశారు. దీంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్లైంది. అలాగే 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బడుగు, బలహీన వర్గాలకే కేటాయించినట్లైంది. వెనకబడిన వర్గాలకు ఆది నుంచి పెద్ద పీట వేస్తున్న టీడీపీ… తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది.

ALSO READ  YS Jagan: ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికపై.. స్పందించిన జగన్

ఇది కూడా చదవండి:  Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కిడ్నాప్ హత్యల కలకలం.. వరుసగా ఘటనలు

రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. పార్టీలో మొదటి నుంచీ అంటిపెట్టుకుని ఉన్న బీదా రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ దక్కింది. యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది. 

ప్రాంతాల సమతూకం, వెనుకబడిన వర్గాలకు పదవులు కట్టబెట్టడం ద్వారా.. పార్టీలోని ఆశావహులు నిరసన గళం ఎత్తడానికి వీలు లేకుండా చేశారు సీఎం చంద్రబాబు. ఇక సీఎం చంద్రబాబు ఎప్పుడెప్పుడు దొరుకుతారా? ఏ రకంగా విమర్శలు చేయాలా? సామాజికవర్గాలను ఎలా రెచ్చగొట్టాలా? అని కాచుకుని కూర్చున్న వైసీపీ నేతలకు అయితే నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. చంద్రబాబు సొంత సామాజికవర్గంలో కూడా సమర్థులైన, ఎమ్మెల్సీ పదవికి అన్ని అర్హతలున్న అభ్యర్థులున్నారు అనేక మంది ఉన్నారు.

వారంతా తమకు ఎమ్మెల్సీ తప్పకుండా దక్కుతుందని మొదట్నుంచీ ఆశలు పెట్టుకున్నారు. అయితే మూడింటిలో ఆ సామాజికవర్గానికి ఒక్క ఎమ్మెల్సీ దక్కి ఉన్నా సరే… వైసీపీ నేతలు చేసే రాద్దాంతం మరోలా ఉండేది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఆ అవకాశానికి గండి పడటంతో.. ఇప్పుడు పిఠాపురం వర్మపై పడుతున్నారు. అక్కడి తమ్ముళ్లను రెచ్చగొట్టే పనిలో పడ్డారు వైసీపీయులంతా. అయితే వర్మతో పాటూ బుద్ధా వెంకన్న లాంటి నేతలంతా అధినేతపై తమ విశ్వాసాన్ని మరోసారి ప్రకటించడంతో.. వైసీపీ ప్రయత్నాలకు ఆదిలోనే బ్రేక్‌ పడ్డట్లయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *