Women’s T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు 9 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మహిళల టీ20 ప్రపంచకప్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది . షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ కల దాదాపుగా పోయింది. కానీ పూర్తిగా దారులు మూసుకుపోలేదు. అంటే భారత్ క్రికెట్ మహిళల టీ20 ప్రపంచకప్ భవితవ్యం ఏంటనేది ఈరోజు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో తేలుతుంది.
ఎందుకంటే..
Women’s T20 World Cup 2024: గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు 8 పాయింట్లు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు రెండో స్థానం కోసం భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా +0.322 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. అలాగే న్యూజిలాండ్ +0.282 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -0.488తో నాలుగో స్థానంలో ఉంది.
ఇక్కడ, భారత్ (+0.322), న్యూజిలాండ్ (+0.282) సెమీ-ఫైనల్లోకి ప్రవేశించే ఛాన్స్ లు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ దానిని నిర్ణయిస్తుంది. అంటే న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫలితం ఇక్కడ నిర్ణయాత్మకం.
Women’s T20 World Cup 2024: న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే నెట్ రన్ రేట్ సాయంతో భారత్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. న్యూజిలాండ్ గెలిస్తే 6 పాయింట్లతో సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. టీమ్ ఇండియా ఎలిమినేట్ అవుతుంది.
న్యూజిలాండ్‌పై భారీ తేడాతో గెలిస్తే పాకిస్థాన్ జట్టు కూడా సెమీస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే, అది అంత ఈజీ కాదు. అలా అని పాకిస్తాన్ తక్కువ అంచనా వేయకూడదు. ఈ పరిస్థితిలో ఈ మూడు జట్లు సెమీఫైనల్‌కు ఎలా చేరుకోవచ్చో చూద్దాం..
- న్యూజిలాండ్‌పై పాక్ గెలిస్తే భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుంది.
- పాకిస్థాన్‌పై గెలిస్తే న్యూజిలాండ్ జట్టు నేరుగా రన్ రేట్ తో సంబంధం లేకుండా సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుంది.
- న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసి 53 పరుగుల తేడాతో గెలిస్తే పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది .
Women’s T20 World Cup 2024: అంటే టీమ్ ఇండియా సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలవ్వాలి. పాకిస్థాన్ జట్టు భారీ తేడాతో గెలవకూడదు. ఈ సందర్భంలో, నెట్ రన్ రేట్లో భారత జట్టు రెండు జట్లను అధిగమించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించవచ్చు. ఇంకా చెప్పాలంటే.. పాక్ కచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలవాలి. కానీ పెద్ద తేడాతో గెలవకూడదు. అప్పుడు టీమిండియా మహిళలకు సెమీస్ ఛాన్స్ వస్తుంది.


