Women’s Commission: ప్రస్తుతం పాటల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. హుక్ స్టెప్పులు అనే కాన్సెప్ట్ వచ్చాక, హీరో, హీరోయిన్ల డ్యాన్స్ మూమెంట్స్ లో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం హుక్ స్టెప్పులు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కాకుండా, అనవసరమైన వాదనలకు, విమర్శలకు దారి తీస్తున్నాయి.ఇప్పుడవి మరీ ఘాటుగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలోని ‘అదిదా సర్‌ప్రైజు’ పాట దీనికి తాజా ఉదాహరణ. ఇందులో కేతికా శర్మ చేసిన హాట్ మూమెంట్స్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పాట విడుదలైన కొద్ది గంటలకే హుక్ స్టెప్పులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది.
Also Read: OTT: వారంలోపే ఓటిటిలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ థ్రిల్లర్!
ఈ పరిణామాల నేపథ్యంలో మహిళా కమిషన్ దీనిపై అధికారికంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. కొన్ని మూమెంట్స్ మహిళల అభిమానం దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని సూచిస్తూ ప్రొడక్షన్ హౌస్ కు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పాటలో వివాదాస్పద హుక్ స్టెప్పులను మేకర్స్ మారుస్తున్నారని టాక్.