Woman Team India for Newzealand

Woman Team India for Newzealand: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత మహిళా జట్టు ఇదే..

Woman Team India for Newzealand: భారత్-న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. ఈ నెలాఖరులో భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగే 3 వన్డేల సిరీస్‌కు టీమ్ ఇండియాలో ఉండే ఆటగాళ్ల లిస్ట్ విడుదలైంది. ఈ సిరీస్ లో టీమిండియా ఆటగాళ్ల విషయంలో భారీ మార్పులు ఉంటాయని అందరూ ఊహించారు. కానీ, హర్మన్‌ప్రీత్ కౌర్‌ను జట్టు కెప్టెన్‌గా కొనసాగిస్తూనే,  T20 ప్రపంచ కప్‌లో ఆడిన దాదాపు అందరు ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు.

Woman Team India for Newzealand: యూఏఈలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో ఘోరంగా విఫ్లం అయింది. గ్రూప్ దశలోనే తమ జర్నీని ముగించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. అప్పటి నుండి, కెప్టెన్సీతో పాటు, చాలా మంది మహిళా ఆటగాళ్లను జట్టు నుండి తొలగించాలని చాలామంది కోరుతూ వస్తున్నారు. కానీ సీనియర్ మహిళా సెలక్షన్ కమిటీ అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్‌గా కొనసాగించారు.  వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆమె జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని BCCI ధృవీకరించింది.

Woman Team India for Newzealand: భారత్-న్యూజీలాండ్  3 వన్డేల సిరీస్ అక్టోబర్ 24 నుండి ప్రారంభం కానుంది.  దీని కోసం కివీస్ యుఎఇ నుండి నేరుగా భారత్‌కు రానుంది. అక్టోబర్ 24, 27, 29 తేదీల్లో సిరీస్ ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

సిరీస్ నుండి ఎవరు ఔట్?

Woman Team India for Newzealand: పైన చెప్పినట్లుగా, T20 ప్రపంచ కప్‌లో భాగమైన చాలా మంది ఆటగాళ్లను జట్టులో ఉంచారు. అయితే, స్టార్ ఆల్-రౌండర్ పూజా వస్త్రాకర్‌కు ఈ సిరీస్ నుండి విశ్రాంతిఇచ్చారు. యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ 12వ తరగతి బోర్డు పరీక్షల కారణంగా సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ప్రపంచకప్ సందర్భంగా గాయపడిన లెగ్ స్పిన్నర్ ఆశా శోభన ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఆమె కూడా ఈ సిరీస్‌లో ఆడదు.

ఈ సిరీస్‌లో రిచా స్థానంలో యాస్తిక భాటియా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనుంది. ఆమెతో పాటు యువ వికెట్ కీపర్ ఉమా ఛెత్రి కూడా సిరీస్‌కి ఎంపికైంది. అలాగే,  టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దయాళన్ హేమలత, సైమా ఠాకోర్, తేజల్ హసన్‌బిస్, సయాలీ సత్‌గారే కూడా జట్టులోకి ఎంపికయ్యారు.

ఈనెల 24 నుంచి.. 

 3 వన్డేల సిరీస్ అక్టోబర్ 24 నుండి ప్రారంభం కానుంది.  దీని కోసం కివీస్ యుఎఇ నుండి నేరుగా భారత్‌కు రానుంది. అక్టోబర్ 24, 27, 29 తేదీల్లో సిరీస్ ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దయాళన్ హేమలత, దీప్తి శర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), సయాలీ సత్గారే, అరుంధతి , తేజల్ హసన్‌బిస్, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, రాంకా పాటిల్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *