AP News

AP News: జమ్మూ నుంచి విశాఖకు వచ్చి యువతిపై దాడి

AP News: అనారోగ్యంతో బెడ్ పై హాస్పిటల్ లో…ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటె..పక్క బెడ్ లో ఉన్న ..మరో పేషంట్ ..హాయ్ ఐ యామ్ శర్మ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. యా హలో అని చేయి చేయి కలిసింది. కొన్ని రోజులకు ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. ఒక రోజు మెసేజ్. హాయ్ గుర్తుపట్టావా ..నేను శర్మని ..హాస్పిటల్ లో కలిశాం కదా అని టెక్స్ట్ చేశాడు. సరే అని రిప్లై ఇచ్చింది. కట్ చేస్తే …కత్తితో ఇంటి ముందు వచ్చేసాడు.

తనను ప్రేమించడం లేదని కక్షగట్టిన ఓ ప్రేమోన్మాది..జమ్మూ నుంచి విశాఖకు వచ్చి మరీ యువతి పై దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణపాయ స్థితిలో చికిత్స తీసుకుంటుంది. గాజువాక బాలచెరువు కాలనీలో జరిగిన ఈ దారుణం పై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..డిగ్రీ పూర్తి చేసిన మేఘన అనే యువతి ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా గతేడాది రాజస్థాన్‌ లోని మౌంట్ అబుకు వెళ్లింది.

AP News: అక్కడ జ్వరం రావడంతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది.అదే సమయంలో జమ్మూ లోని ఉద్దంపూర్‌ కు చెందిన నీరజ్‌ శర్మ అనే యువకుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…మేఘనతో పరిచయం పెంచుకున్నాడు.

ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చిన మేఘనకు నీరజ్‌ తరచూ ఫోన్ చేస్తూ ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ ఉండేవాడు. అంతేకాకుండా అతని ఫొటోలు కూడా పంపుతుండేవాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పినా, తన పాత వీడియోలు, అశ్లీల చిత్రాలు పంపించి, వేధించడం మొదలు పెట్టారు.

AP News: మేఘన తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారు గతంలో న్యూపోర్టు పోలీసులకు సైబర్‌ క్రైం విభాగంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్‌లో నీరజ్‌ వర్మను హెచ్చరించారు. మేఘన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసుకొని , హెల్మెట్ ధరించి వచ్చిన నీరజ్‌ నేరుగా ఆమె గదిలోకి వెళ్లాడు.

వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌ తో దాడికి దిగాడు. తల, భుజం, చేతుల పై విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె కేకలు విని పక్కింట్లో ఉంటున్న సాయి కృష్ణ అనే యువకుడు రాగా, అతని పైనా దాడికి దిగాడు. నిందితుడు పారిపోతుండగా..అదే ప్రాంతానికి చెందిన హోంగార్డు శ్రీను నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను దొరకలేదు.

AP News: బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, తల పై 31 కుట్లు పడ్డాయి. చేతి చూపుడు వేలు తెగిపోయింది. రెండు మోచేతులు కూడా ఛిద్రమయ్యాయి. జోన్‌ 2 డీసీపీ మేరీ ప్రశాంతి, హార్బర్‌ ఏసీపీ కాళిదాస్‌ న్యూపోర్టు సీఐ దాలిబాబు ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు.నిందితుడి కోసం గాలిస్తున్నారు. నీరజ్‌ రెండు రోజుల క్రితమే జమ్మూ నుంచి ఇక్కడికి వచ్చి రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ALSO READ  Nirmal district: నిర్మ‌ల్ జిల్లాలో దారుణం.. బాలిక‌పై లైంగిక‌దాడి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *