Pushpa 2: ఇప్పటికే ‘పుష్ప -2’ నుండి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సాంగ్ రాబోతోంది. విశేషం ఏమంటే… ఇది చివరాఖరున చిత్రీకరణ జరుపుకున్న ఐటమ్ సాంగ్. ‘పుష్ప’ తొలి భాగం ఐటమ్ సాంగ్ లో సమంత నర్తించి కుర్రకారు గుండెల్లో వేడి సెగలు రేపింది. ఇప్పుడీ బాధ్యతను శ్రీలీల తీసుకుంది. డాన్సింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల… బన్నీ తో కలిసి ఏ మేరకు ఈ పాటలో ఇరగదీసిందో నవంబర్ 24న తెలియబోతోంది. ఆ రోజు రాత్రి 7.2 నిమిషాలకు ఈ కిస్సక్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల పాట్నాలో జరిగిన భారీ సభలో ట్రైలర్ విడుదల చేసిన నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ నెల 24న చెన్నయ్ లోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఈ ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. విడుదలకు ముందే ఆకాశమే హద్దుగా అంచనాలను పెంచుకున్న’పుష్ప -2′ డిసెంబర్ 5న జనం ముందుకు రాబోతోంది.