Winter Season: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. గత నాలుగు రోజులుగా చలి గాలులు వీస్తుండగా, నవంబర్ 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. ప్రధానంగా నవంబర్ 13 నుంచి 17 వరకు ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువకు పడిపోవచ్చని చెప్తున్నారు.
Winter Season: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉండే దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14 నుంచి 17 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణలో పడమర వైపున ఉన్న జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీ ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ నమోదయ్యే అవకాశం ఉన్నది.
Winter Season: సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత తరచూగా ఉండదు. కానీ ఈ ఏడాది 8 నుంచి 10 రోజుల పాటు తీవ్రమైన చలి వాతావరణం ఉండబోతుండటం గమనార్హం. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి సహా మధ్య తెలంగాణ జిల్లాల్లో 11 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రత నమోదవుతుంది.

