Winter Season: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి వణికిస్తున్నది. వరుస అల్పపీడనాల ప్రభావంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఫలితంగా ఉదయం, సాయంత్రం పూటల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోగా, శీతల గాలులు వీయడంతో ప్రజలు చలికి విలవిల్లాడిపోయారు. రాత్రంతా పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా చలి భయంతోనే కాలం గడిపారు.
Winter Season: ముఖ్యంగా తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోయాయి. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా, నిర్మల్ 8.5, నిర్మల్ జిల్లా పెంబిలో 9.3, మెదక్ 10.8, నిజామాబాద్ 13.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగర వాసులు చలితో వణికిపోతున్నారు. రాత్రి, ఉదయం వేళల్లో బయట తిరగాలంటేనే భయపడిపోతున్నారు.
Winter Season: చలి తీవ్రత కారణంగా వివిధ దీర్ఘకాల వ్యాధులున్న వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా సరైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.