SpiceJet

SpiceJet: విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్‌..వణికిపోయిన ప్రయాణికులు

SpiceJet: స్పైస్‌జెట్‌కు చెందిన ఒక విమానం గాల్లో ఉన్నప్పుడే ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. పుణె నుంచి గోవా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కిటికీకి సంబంధించిన లోపలి ఫ్రేమ్ ఊడిపోయింది. ఇది చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికుల్లో ఒకరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ  వీడియో వైరల్‌గా మారింది.

ప్రయాణికుల్లో భయాందోళన

ఈ ఘటన పుణె-గోవా మార్గంలో జరిగినది. క్యూ400 విమానంలో ఓ ప్రయాణికుడు కూర్చున్న సీటు వద్ద అకస్మాత్తుగా కిటికీ లోపలి ఫ్రేమ్ ఊడిపోవడంతో ఆ ప్రయాణికుడు వెంటనే వీడియో తీసి ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియోతో విమాన సంస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా ఇలా నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

స్పైస్‌జెట్ స్పందన

ఈ ఘటనపై స్పైస్‌జెట్ సంస్థ స్పందించింది. ఊడిపోయినది కిటికీ అద్దం కాదని, కేవలం లోపలి అలంకరణ ఫ్రేమ్ మాత్రమేనని స్పష్టం చేసింది. ఇది కేవలం నిడివి కోసం పెట్టిన ఫ్రేమ్ మాత్రమేనని, విమాన భద్రతకు దీనికి సంబంధం లేదని చెప్పింది. “విమానానికి సంబంధించిన కిటికీలకు బహుళ పొరల రక్షణ ఉంటుంది. బయటి అద్దం దృఢంగా ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదు” అని స్పష్టం చేసింది. పూణెకు ల్యాండ్ అయిన తర్వాత, ఫ్రేమ్‌ను తిరిగి బిగించినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: Mahaa Vamsi Donates 1 lakh: 106 ఏళ్ల చరిత్ర MCPS కొండయ్యపాలెం.. లైవ్ లో మహా వంశీ లక్ష విరాళం

నిర్లక్ష్యం పై నెటిజన్ల మండిపాటు

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తనిఖీలు చేయకుండా విమానాలను ఎలా నడుపుతారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో విమాన సంస్థలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని డిమాండ్ చేస్తున్నారు. “ఇలాంటి విమానాలకు ఎగిరే హక్కే ఉందా?” అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల వరుసగా ఘటనలు.. భయాందోళన

ఇటీవల కాలంలో విమాన ఘటనలు పెరుగుతుండటంతో ప్రయాణికుల్లో భయం పెరుగుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికుల్లో అప్రమత్తత మరింత పెరిగింది. తాజాగా జరిగిన ఈ ఘటనలో కూడా ప్రయాణికులు గాల్లో ఉండగానే భయంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ALSO READ  Tirupati: తిరుపతి ఆలయానికి 4 పెద్ద వెండి దీపాలను విరాళంగా ఇచ్చిన ముగ్గురు బెంగళూరు భక్తులు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *