Uttar Pradesh

Uttar Pradesh: యూపీలో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు

Uttar Pradesh: ఈ మధ్యకాలంలో ప్రేమ-పెళ్లిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. కొన్నాళ్లు విభేదాలు వచ్చి విడిపోతున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అప్ కోర్సు.. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు ఆడపిల్లను ఒప్పించి పెళ్లి చేసినా, ఆ కాపురం సజావుగా సాగిన సందర్భం కనిపించ లేదు. ఫలితంగా నిందితులు అవుతున్నారు.

తాజాగా యూపీలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. పెళ్లయిన రెండు వారాలకే భర్తను చంపేసింది భార్య. అది కూడా ప్రేమించిన లవర్స్ కోసం. సంచలనం రేపిన ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త హత్య వెనుక అసలేం జరిగింది..? దీనికి స్కెచ్ వేసిందెవరు…? 25 ఏళ్ల దిలీప్​ యాదవ్‌కు రెండు వారాల కిందట 22 ఏళ్ల ప్రగతి యాదవ్‌తో పెళ్లి జరిగింది.

పెద్దలు దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఇద్దరు అందంగా ఉంటారు. పిల్లలు ఓకే అన్న తర్వాతే పెళ్లికి మొగ్గు చూపారు ఇరు కుటుంబాలు. కట్న కానుకల కిందట అల్లుడికి బాగానే ముట్టుజెప్పారు అత్తింటివారు.

అయితే ప్రగతి తన మనసులో ఏంముందో కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు. కూతురు మనసులో ఏమందో కనీసం తల్లిదండ్రులు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక అమ్మాయి జీవితం చూడాల్సిన అవసరం లేదనుకున్నారు తల్లిదండ్రులు.పెళ్లికి ముందు ప్రగతికి ఓ లవర్​ ఉన్నాడు. అతడి పేరు అనురాగ్​ అలియాస్​ మనోజ్​. పెళ్లయిన నుంచి కాస్త భార్తతో చిరాకుగా వ్యవహరించేది ప్రగతి. కానీ, అసలు విషయం భర్తకు తెలియలేదు. ఈ క్రమంలో భర్తను చంపాలని ప్రగతి భావించింది. ఈ విషయాన్ని తన ప్రియుడు అనురాగ్ చెవిలో ఊదింది.

Also Read: Viral News: మేక‌పై వికృత చ‌ర్య.. అడ్డుకున్న య‌జ‌మానిపైనే దుండగుడి దాడి

ఇంకేముంది.. పెళ్లయినా ప్రగతి తనను వదిలి ఉండలేక పోతుందని భావించాడు. చివరకు ప్రగతి ఆమె లవర్ అనురాగ్ కలిసి దిలీప్ హత్యకు పథకం వేశారు. భర్త దిలీప్‌ని చంపాలని రామ్​జీ చౌదరీ అనే కాంట్రాక్ట్​ కిల్లర్‌కి చెప్పారు. అడ్వాన్సుగా కిల్లర్‌కు రెండు లక్షల రూపాయలు ఇచ్చేశారు.మార్చి 19న తన పొలంలో పని చేస్తున్న సమయంలో దిలీప్‌పై కాంట్రాక్టు కిల్లర్ రామ్​జీ చౌదరీ దాడి చేశాడు. ఆపై అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి కొన ఊపిరితో పడి ఉన్నాడు. ఈ సమాచారం స్థానికుల ద్వారా దిలీప్ కుటుంబానికి తెలిసింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడ్ని స్థానిక బిధౌనాలోని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్‌కి తరలించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిలీప్‌ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినా ఫలితం లేకపోయింది. దిలీప్​ భార్యపై అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. హత్య వెనుక సూత్రధారి ప్రగతి అని తేలిపోయింది. ఆమెతోపాటు లవర్ అనురాగ్​, కిల్లర్ రామ్​జీలు అరెస్ట్​ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *