facts

Facts: మందు తాగే ముందు మందుబాబులు ఇలా ఎందుకు చేస్తారంటే?

Facts: మందుబాబులు మద్యం సేవించేటప్పుడు గ్లాసులోని వేలు ఉంచి కొన్ని చుక్కలను నేలపై చల్లుతారు. ఇది ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియదు. దీని కోసం చాలామంది గూగుల్‌లో కూడా శోధించారు. ఓ జ్యోతిష్యుడు చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనురాగ్ ఠాకూర్ అనే జ్యోతిష్యుడు మద్యం తాగేటప్పుడు నేలపై మద్యం చుక్కలు ఎందుకు చల్లుతారో వివరించాడు. దీని ప్రకారం, జ్యోతిషశాస్త్రంలో దీనికి ఒక కారణం ఉందట. తాగుబోతులు తమ జీవితాల్లో శని ప్రభావాన్ని తగ్గించడానికి ఇలా చేస్తారని వెల్లడించారు.

ఠాకూర్ ప్రకారం ఈ టెక్నిక్ శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారట. మద్యం తాగే ముందు, నేలపై కొన్ని చుక్కలు చల్లుకుంటే మీ అదృష్టం మారుతుందని… మీరు మీ ఉంగరపు వేలును మద్యంలో ముంచి, నేలపై మద్యం చుక్కలను చల్లినప్పుడు, తమ జీవితాలను ప్రభావితం చేసే శని ప్రశాంతంగా ఉంటాడని నమ్ముతారట. దీనివల్ల మద్యపానం చేసేవారి జీవితాల్లో కొన్ని మంచి విషయాలు జరుగుతాయట.

ఇది కూడా చదవండి: Tulsi Plantవేసవిలో తులసి మొక్క పచ్చగా ఉండాలంటే ఈ పని చేయండి!

గతంలో మద్యం ప్రియులు ఇంట్లో తయారుచేసిన మద్యం (రూడీ మార్క) తాగేవారు. ఆల్కహాల్ కెపాసిటీని చెక్ చేయడానికి గ్లాస్ లోని మందును నేలపై రెండు చుక్కలను వేసేవారు. మట్టి బుడగలు ఏర్పడటం ప్రారంభిస్తే మద్యం స్ట్రాంగ్‌గా ఉందో లేదో చెక్ చేసుకునేవారు. బుడగలు తగ్గినట్లయితే అప్పుడు మద్యం పెద్దగా కిక్ ఇవ్వదని డిసైడ్ అయ్యేవారు. గ్రామీణ ప్రజల డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ (ప్రయోగశాల) లో ఇదో రకం. అంతే కాని దీనిపై సంప్రదాయం, ఆచారం లేదంటున్నారు. ప్రతి పాత విషయానికి కొంత అర్థం ఉంటుంది. మనకు తెలియకుండానే వాటిని అలా చేయడం మొదలుపెడతాం.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *