Bollywood Cinema: గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్రాంచైజీలపై బాగా ఆధారపడుతోంది. ఒక సినిమా హిట్ అయ్యిందంటే చాలు, వెంటనే దానికి రెండో, మూడో భాగం ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే, అవెరగె అయినా సినిమాకి కూడా సీక్వెల్‌గా తీయడానికి ప్రయతిస్తున్నారు. భూల్ భూలైయా 2 (2022) నుండి వార్ 2 (2025), ధడక్ 2 (2025), జాలీ ఎల్ఎల్బీ 3 (2025) వరకు, “టు బీ కంటిన్యూడ్” అనేది సర్వ సాధారణం అయిపోయింది.
ఫ్రాంచైజ్ ఫార్ములా – హాలీవుడ్ నుండి ఇంపోర్ట్
హాలీవుడ్లో మార్వెల్, డిసి, ఫాస్ట్ & ఫ్యూరియస్ మిషన్ ఇంపాజిబుల్ లాంటి సిరీస్‌లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలని అందుకుంటున్నాయి. అదే ఫార్ములాను బాలీవుడ్ కూడా ఫాలో కావాలని చూస్తుంది. రోహిత్ శెట్టి పోలీస్ యూనివర్స్, YRF స్పై యూనివర్స్, హర్రర్-కామెడీ ఫ్రాంచైజీలు అని అందులో భాగమే.
దర్శకుడు అనీస్ బాజ్మీ చెప్పినట్టుగా, “మొదటి సినిమాలో క్యారెక్టర్స్ సెటప్ చేయడానికి టైమ్ పడుతుంది. కానీ సీక్వెల్లో ప్రేక్షకులు క్యారెక్టర్ ని ముందుగానే చూసుంటారు కాబట్టి కొత్తగా వాళ్ళ గురించి వివరించాల్సిన పని తగ్గుతుంది. అదే టైమ్‌తో కథను ముందుకు తీసుకెళ్లొచ్చు” అంటారు. అయితే ఆయన కూడా ఒప్పుకుంటారు – ఫ్రాంచైజీ రాయడం అసలు సినిమాకంటే కష్టమే అని. ఎందుకంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి అని అన్నారు.
డబ్బే ప్రధాన లక్ష్యం
బాలీవుడ్ ఇప్పుడు కంటెంట్ క్రైసిస్‌లో ఉంది. అక్కడ హిట్ రేట్ చాలా తగ్గింది. ఇంతకుముందు ఏడాదికి 20 సినిమాలు సక్సెస్ అయితే, ఇప్పుడు 4–5 మాత్రమే హిట్ అవుతున్నాయి. అందుకే నిర్మాతలు “రీమేక్ అయినా, సీక్వెల్ అయినా, ఫ్రాంచైజీ అయినా బాక్సాఫీస్‌లో వద్ద కలెక్షన్స్ వస్తే చల్లు అనే ఆలోచనలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Delivery Boy Attacked: ఫుడ్ డెలివరీ బాయ్‌పై దారుణం.. ఆర్డర్ ఆలస్యమైందని దాడి
సౌత్‌లో కూడా అదే ట్రెండ్
ఇది బాలీవుడ్‌కే పరిమితం కాదు. దక్షిణాది పరిశ్రమ కూడా ఫ్రాంచైజీలే బాట పట్టింది. పుష్ప 2, కేజీఎఫ్ 2, దృశ్యం 2, రాబోయే కాంతారా: చాప్టర్ 1, పుష్ప 3 ఇవన్నీ ఫ్రాంచైజీ మోడల్‌కి నిదర్శనం. బాహుబలి అయితే సీక్వెల్ కి హుక్ తో ముగించింది. (కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?)అనే పాయింట్ తో ఎండ్ చేయడంతో సినిమాపైన ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయగలిగారు.
క్రియేటివిటీ వర్సెస్ సేఫ్టీ నెట్
దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాటల్లో “ఇండస్ట్రీ కన్ఫ్యూజన్లో ఉంది అన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాబట్టి హిట్ కొట్టడానికి సేఫ్ గా ఫ్రాంచైజీలనే ఎంచుకుంటున్నారు అన్నారు.
నిఖిల్ అద్వానీ మాత్రం హెచ్చరిస్తున్నారు “మార్వెల్నే చూడండి. కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్సు కి నచ్చుతాయి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవుతాయి. కానీ హాట్ కోసం ఫార్ములాను ఫాలో అవ్వడం సినిమాకి మంచిది కాదు అవి సినిమాని ని కేవలం ‘ప్రాజెక్ట్’గా మారుస్తాయి. సినిమా అని డైరెక్టర్ లేదా రైటర్ ఓన్ వాయిస్ కథ, ఒక విషయాని చూసే దుష్టికోణం, ఇవి అని కలిపితేనే నిజమైన సినిమా పుడుతుంది దానికి ఒక్క ప్రాణం ఉంటుంది.
ఫ్రాంచైజీ విజయ రహస్యం
విజయవంతమైన ఫ్రాంచైజీ అంటే కేవలం రెండవ భాగాన్ని తీయడం మాత్రమే కాదు. ప్రతి భాగానికి సంతృప్తికరమైన ముగింపు ఇవ్వాలి. అదే సమయంలో నెక్స్ట్ వచ్చే భాగం పైన హైప్ క్రియేట్ చేయాలి. పుష్ప 2 చివరి సీన్లో మూడో భాగం కోసం వేసిన హుక్ తో నెక్స్ట్ వచ్చే భాగంపైనా ఫ్యాన్స్‌లో క్రేజ్ క్రియేట్ చేసింది.
చివరి మాట
ఫ్రాంచైజీలు తీయడం వాళ్ళ బాక్స్ ఆఫీస్ వద్ద కొంత సేఫ్ ఆడొచ్చు, ముందు భాగం వాళ్ళ నెక్స్ట్ వచ్చే మూవీస్ కి ఆల్రెడీ క్రేజ్ ఉంటుంది. దానితో సినిమాకి కొంత డబ్బులు కూడా వస్తాయి. కానీ దీనివల్ల హాలీవుడ్ లో ఒరిజినల్ మూవీస్ తీయడం తాగించారో.. వచ్చిన వాటిని ఆడియన్సు చూడకుండా ఉంటున్నారో అలాగే మనదగ్గర కూడా జరిగే ఛాన్స్ ఉంది. రెండు మూడు భాగాలు తీయడమే సినిమా కాదు. ఒరిజినాలిటీ తో మంచి సినిమా తిస్తె ఆడియన్సు ఎపుడు సినిమాని ఎంకరేజ్ చేస్తారు.