Black Tea Vs Black Coffee

Black Tea Vs Black Coffee: బ్లాక్ టీ – బ్లాక్ కాఫీ.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

Black Tea Vs Black Coffee: కాఫీ, టీ ఏదో ఒకటి తాగకపోతే చాలా మందికి డే ప్రారంభం కాదు. చాలా లేజీగా అనిపిస్తుంది. కొంత మంది బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ తాగుతుంటారు. అయితే బ్లాక్ టీ కంటే బ్లాక్ కాఫీ మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో బ్లాక్ కాఫీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక కప్పు బ్లాక్ కాఫీలో దాదాపు 95 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. అదే కప్పు బ్లాక్ టీలో 26-48 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట లేదా పని సమయంలో ఏకాగ్రతను పెంచుకోవాలనుకునే వారికి బ్లాక్ కాఫీ గొప్ప పానీయం.

కాఫీలో చక్కెర లేదా పాలు జోడించకుండా తీసుకుంటే బరువు తగ్గడానికి ఉత్తమంగా పనిచేస్తుంది. కానీ టీలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, చక్కెర, పాలు లేదా తేనె కలపడం వల్ల ఎక్కువ కేలరీలు యాడ్ అవుతాయి. కాబట్టి బ్లాక్ కాఫీ వినియోగం జీవక్రియను మెరుగుపరుస్తుంది.

బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే ఈ బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ కాఫీలోని పాలీఫెనాల్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఇది ఆరోగ్య రక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వంటి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం బ్లాక్ కాఫీలో ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాద స్థాయిని తగ్గిస్తుంది. బ్లాక్ టీలో ఈ సామర్థ్యం ఉన్నప్పటికీ, బ్లాక్ కాఫీతో పోలిస్తే దానిలో కెఫీన్ తక్కువగా ఉండటం వల్ల ఇది తక్షణ ప్రభావం చూపదు.

బ్లాక్ కాఫీ ఒక గొప్ప స్పోర్ట్స్ డ్రింక్. ఇది శారీరక పనితీరును ప్రోత్సహిస్తుంది. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించి శారీరక శ్రమకు శక్తిగా మార్చే ఆడ్రినలిన్ స్థాయి పెరుగుతుంది. కానీ బ్లాక్ టీ హైడ్రేటింగ్ అయినప్పటికీ ఇది శారీరక పనితీరును మెరుగుపరచదు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *