Life style: పసివాళ్లకు స్నానం చేయించటమన్నది అతి పెద్ద టాస్క్. అందుకనే పసిపిల్లలకు అత్తగారో, అమ్మ వంటి పెద్దవారో ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తుంటారు. స్నాన సమయంలో నీళ్ళు చెవుల్లోకి, ముక్కుల్లోకి పోతే పిల్లాడికి ఇబ్బందీ, ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ళ మీద పడుకోబెట్టుకొని, వేడి నీటితో సాన్నం చేయిస్తారు. స్నానానికి అరగంట ముందు పిల్లవానికి లేదా పిల్ల ఒంటికి నూనె రాసి, చిన్నగా మెత్తగా మసాజ్ చేసి మాడుకు ఆముదం పెట్టి, ఆపై నలుగుపెండితో స్నానం చేయించాలి.
అలా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తే పిల్లలు ఏడవరు. నలుగుపెట్టి, నూనె రాసి స్నానం చేయించటం ద్వారా పసిబిడ్డలకి వ్యాయామం అవుతుంది. తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీర పటుత్వం వస్తుంది. అందంగా, ఆరోగ్యంగా పెరుగుతారు పిల్లలు.
ఇది మన పూర్వీకులు మనకు నేర్పిన సాంప్రదాయం. చంటిబిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి, మంచి అలవాట్లు నేర్చుకోవడానికి చిన్న నాటి నుంచే బీజం వేస్తారు మన పెద్దలు. చిన్న పిల్లలకు మంచిని నేర్పడంలో మన తర్వాతే ఎవరైనా!

