Prabhas: ప్రభాస్ నటిస్తున్న భారీ హర్రర్ థ్రిల్లర్ ‘రాజాసాబ్’ టీజర్‌ను రాబోయే రెండు వారాల్లో రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ ఇప్పటికే టీజర్ కట్‌ను పూర్తి చేశారు, కేవలం ప్రభాస్ డబ్బింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం హాలిడే టూర్‌లో ఉన్న ప్రభాస్, త్వరలో తిరిగి వచ్చి డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రెండు వారాల్లో టీజర్ రిలీజ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
Also Read: HIT 3: ‘హిట్ 3’ టికెట్ ధరల పెంపు.. ఏపీ ప్రభుత్వం అనుమతి
ప్రభాస్ సినిమాల నుంచి అప్‌డేట్స్ రాక చాలా కాలమైంది. ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచడానికి మూవీ టీమ్ ఈ టీజర్‌తో పాటు వరుస అప్‌డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘రాజాసాబ్’ టీజర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి!
రాజాసాబ్ గ్లింప్సె :