Baaghi-4: ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ 2016లో ‘బాఘీ’ చిత్రం ద్వారానే హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి భాగంలో సుధీర్ బాబు విలన్ గా నటించాడు. విశేషం ఏమంటే… ‘బాఘీ’ మూవీకి సీక్వెల్ ఆ తర్వాత రెండేళ్ళకు వచ్చింది. మళ్ళీ మరో రెండేళ్ళకు ‘బాఘీ -3’ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఐదేళ్ళ తర్వాత దీని నాలుగో భాగం రాబోతోంది. ‘బాఘీ -4’ సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి వచ్చింది. ఇందులో సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న సంజయ్ దత్ ఒడిలో చనిపోయిన ఓ అమ్మాయి ఉంది. పక్కన ‘ప్రతి ప్రేమికుడు ఒక ప్రతినాయకుడు’ అనే కాప్షన్ పెట్టారు. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చ యేడాది సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సాజిద్ నడియాద్ వాలా ప్రకటించారు. సంజయ్ దత్ పోస్టర్ ను చూసిన చాలా మంది నెటిజన్స్ దీనిని ‘యానిమల్’తో పోల్చుతుంటే… మరికొందరు ఇది ‘యానిమల్’కు సీక్వెలా? అని కామెంట్ చేస్తున్నారు.