Viduthalai-2: విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రధారులుగా వెట్రీమారన్ తెరకెక్కించిన ‘విడుదల -2’ మూవీ డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. దీని తెలుగు వర్షన్ హక్కుల్ని చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ ను ఆదివారం చెన్నయ్ లో చిత్ర కథానాయకుడు విజయ్ సేతుపతి ఆవిష్కరించారు. ఇందులో పెరుమాళ్ అనే పాత్రలో విజయ్ సేతుపతి అత్యద్భుత నటనను కనబరిచారు. అతన్ని ఓ పోరాట యోధుడిగా వెట్రీమారన్ తెరపై ప్రెజెంట్ చేశాడు. ఈ చిత్రానికి ఇళయరాజా ఇచ్చిన సంగీతం హైలైట్ గా నిలుస్తుందని, ఈ థాట్ ప్రొవోకింగ్ మూవీలో కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయని చింతపల్లి రామారావు తెలిపారు. ఇందులో మంజు వారియర్, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్, రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
