Wife and Husband: భార్యభర్తల సంబంధంలో ఎక్కువ మంది అవతలి వ్యక్తిలో ఆసక్తి, అభిరుచి, లక్ష్యం, ఆలోచన, గౌరవం, నమ్మకం వంటివి చూస్తారు. కానీ ఈ ఆలోచనల ముసుగులో వయస్సును ఎవరూ పట్టించుకోరు. ఎక్కువ మంది తమ కంటే పెద్దవారు లేదా చిన్నవారిని లైఫ్ పార్ట్నర్గా ఎన్నుకుంటారు. అయితే మానవ సంబంధాలలో ఏజ్ గ్యాప్‌పై ఓ సర్వే కీలక విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక దాంపత్య జీవితాన్ని ఏజ్ గ్యాప్ అనేది ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాల్ని బయటపెట్టింది.
జర్నల్ ఆఫ్ పాపులేషన్ ఎకనామిక్స్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ఏజ్ గ్యాప్ తక్కువ ఉన్న జంటల కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న జంటలు తక్కువ వైవాహిక సంతృప్తిని కలిగి ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. అంటే 0-3 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న జంటలు 4-6 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న జంటల కంటే తక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. ఇక 4-6ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న జంటలు.. 7 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న వారి కంటే ఎక్కువ సంతోషంగా ఉంటారు.
ఇది కూడా చదవండి: Health Tips: నేలపై కూర్చొని భోజనం చేస్తే ఇన్ని లాభాలా!
Wife and Husband: ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ పెరుగుతున్న కొద్దీ దాంపత్య సంతృప్తి తగ్గుతుందని ఈ నివేదిక చెబుతోంది. ఎక్కువ వయస్సు గ్యాప్ ఉన్న జంటలకు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు కూడా అసంతృప్తికి దోహదం చేస్తాయని ఈ అధ్యయనం పేర్కొంది. పెద్ద ఏజ్ గ్యాప్ ఉన్నవారు పిల్లలు, పదవీ విరమణ వంటి సమస్యల విషయానికి వస్తే సవాళ్లను ఎదుర్కొంటారని తేల్చింది. ఏజ్ గ్యాప్ అనేది ఇద్దరి మధ్య సంబంధాన్ని ప్రభావితం చేయగలదని గమనించాల్సిన అంశమని సర్వే స్పష్టం చేస్తోంది. అయితే పైన చెప్పిన ఉదాహారణల్లో భాగస్వాములలో జీవనశైలి, అభిరుచులు, దీర్ఘకాలిక లక్ష్యాలలో గణనీయమైన వ్యత్యాసాలను గుర్తించగలిగినప్పటికీ.. ఏజ్ గ్యాప్ ఉన్న చాలా మంది జంటలు సంతోషంగా ఉండడాన్ని మనం చూడవచ్చు.
మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వయస్సు పట్టింపు లేదని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ మీకు ఏదైనా గందరగోళం ఉంటే, ఈ విషయం గురించి చర్చించుకోవాల్సిన అవసరముందని ఈ సర్వే చెబుతోంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు, మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడి, పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నించడం మంచిది. వయస్సుతో పాటు భవిష్యత్తు లక్ష్యాలు, అభిరుచుల మీ పార్ట్నర్కు అనుకూలంగా ఉన్నాయా లేదా అనే వాటిని చూసుకోవాలి.