Vijay Sethupathi: కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ బాగా ఉందని.. దీనివల్ల తన స్నేహితురాలు ఎంతో ఇబ్బందిపడిందని రమ్య అనే ఓ మహిళ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. విజయ్ సేతుపతి కూడా ఆమెను ఇబ్బందిపెట్టారని తెలిపింది. అయితే ఆమె తన పోస్ట్‌ను కొన్ని గంటల్లో డిలీట్ చేసింది. దీంతో విజయ్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. విమర్శలు నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. దీంతో ఆ మహిళ కోపంలో ఇలా చేశానని.. అది వైరల్ అవుతుందని ఊహించలేదని తెలిపింది. తన స్నేహితురాలి గోప్యత కోసం పోస్ట్ డిలీట్ చేసినట్లు చెప్పింది. దీనిపై స్పందించిన విజయ్, తన గురించి తెలిసినవారు ఈ ఆరోపణలను చూసి నవ్వుకున్నారని, తన కుటుంబం మాత్రం బాధపడిందని చెప్పారు. ఆమెపై సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేశామని, ఇలాంటి ఆరోపణలు తనను ఏమాత్రం కదిలించవని స్పష్టం చేశారు.
