West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాక్ చిత్తు… మూడో వన్డేలో వెస్టీండిస్ విజయం..34 ఏళ్ల తరువాత

West Indies vs Pakistan: పాక్ తో స్వదేశంలో జరిగిన మూడో వన్డేలో వెస్టీండిస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 202 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 294 పరుగులు చేసింది. అతను 94 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఒకానొక దశలో వెస్టిండీస్ 184 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు, హోప్, జస్టిన్ గ్రీవ్స్ (43 నాటౌట్) తో కలిసి ఏడో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, నసీమ్ షా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read: Suresh Raina: మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు జారీ

295 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. 92 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. సల్మాన్ అగా చేసిన 30 పరుగులే పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు. బౌలింగ్‌లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జైడెన్ సీల్స్ పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అతను కేవలం 18 పరుగులిచ్చి కెరీర్ బెస్ట్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో వెస్టిండీస్ క్రికెట్ జట్టులో కొత్త ఉత్సాహం నిండింది. 1991 తర్వాత పాకిస్తాన్‌పై సాధించిన మొదటి ద్వైపాక్షిక సిరీస్ విజయం ఇది. దీంతో, రాబోయే ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2027 అర్హత సాధించేందుకు జట్టుకు ఈ విజయం చాలా కీలకమని చెప్పవచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *