Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో కొత్త వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మమతా దీదీ పశ్చిమ బెంగాల్‌లో ఉన్నంత కాలం, ఆమె ముస్లిం సమాజ ఆస్తులను కాపాడుతుంది అంటూ ఆమె విస్పష్టంగా ప్రకటించారు. కోల్‌కతాలో జరిగిన జైన సమాజ కార్యక్రమంలో మమత మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె “నేను ప్రతి మతానికి సంబంధించిన ప్రాంతాలన్నీ ఎందుకు సందర్శిస్తానని కొంతమంది అడుగుతారు. నా జీవితాంతం నేను వెళ్తాను. ఎవరైనా నన్ను కాల్చినా, నన్ను ఐక్యత నుండి వేరు చేయలేరు. బెంగాల్‌లో మతం పేరుతో విభజన ఉండదు. జీవించు, జీవించనివ్వు, ఇదే మన మార్గం.” అంటూ చెప్పారు.
ఈ ప్రకటనపై బిజెపి నాయకుడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ, మమత ఒక నకిలీ హిందువు అని, ఆమె తన భాష, ప్రవర్తన ద్వారా దీనిని నిరూపించారని అన్నారు. ముర్షిదాబాద్‌లో హిందువుల దుకాణాలు ధ్వంసం చేశారు. పోలీసులపై దాడులు జరిగాయి. అయినప్పటికీ మమత మౌనంగా ఉన్నారంటూ ఆయన చెప్పారు.
లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించిన తర్వాత, వక్ఫ్ సవరణ చట్టం ఏప్రిల్ 8 నుండి దేశంలో అమలులోకి వచ్చింది. దీని రాజ్యాంగబద్ధతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 12 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కోర్టు ఏప్రిల్ 16న విచారిస్తుంది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది. అయితే, సుప్రీంకోర్టు కేవలం 10 పిటిషన్లను మాత్రమే లిస్టింగ్ చేసింది.
Also Read: Trump Tariff: సుంకాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. చైనాకు మాత్రం బిగ్ షాక్!
Mamata Banerjee: వీటిలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, AAP ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, కేరళ జమియాతుల్ ఉలేమా, అంజుమ్ ఖాద్రీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మహ్మద్ షఫీ, మహ్మద్ ఫజ్లూర్ రహీమ్, RJD ఎంపీ మనోజ్ ల పిటిషన్లు ఉన్నాయి.