Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహ నిశ్చితార్థం ఇటీవల ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిపోయింది. అయితే వివాహం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని మాత్రం నాగార్జున తెలియచేయలేదు. తాజాగా వీరి పెళ్ళికి సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి. పసుపు కొట్టడంతో పనులను ప్రారంభించినట్టు శోభిత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలానే ఆ సమయంలో తీసిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తాను కట్టుకున్న ఎర్ర పట్టు చీరను నాగచైతన్య తల్లి, తన కాబోయే అత్తగారు లక్ష్మీ ఇచ్చారంటూ ఓ కామెంట్ కు సమాధానంగా శోభిత తెలిపింది. దాంతో అక్కినేని అభిమానులంతా ‘పెళ్ళి కళ వచ్చేసింది… శోభితా…’ అంటూ అభినందనలు తెలుపుతున్నారు.
