Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు హై అలర్ట్ అనే చెప్పాలి. నగరంలోని పలు ఏరియాలకు నీటి సరఫరా బంద్ చేస్తున్నారు అధికారులు తెలిపారు. సిటీకి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లోని మెయిన్పంపింగ్లైన్కు భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వాటర్బోర్డు అధికారులు సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు రిపేర్లు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సిటీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్ చేసి అవుతుందని అధికారులు తెలిపారు.
ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, -బీరంగూడ, అమీన్ పూర్, ట్రాన్స్ మిషన్ డివిజన్ 2 ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట, – కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వెల్లడించారు.