Warangal: వరంగల్ జిల్లాలో ఓ మూడేళ్ల చిన్నారిపై ఓ కీచకుడు దారుణానికి యత్నించాడు. ఆడుకుంటున్న చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టబోయాడు. ఆ పాప నానమ్మకు అనుమానం వచ్చి ఆ కీచకుడి ఇంటి నుంచి తీసుకొచ్చింది. ఆ దుర్మార్గుడి చర్యలను వచ్చీరాని మాటలతో చెప్పడంతో ఆ దుర్మార్గుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Warangal: వరంగల్ జిల్లా ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేటలో మూడేళ్ల చిన్నారి (3), తన అన్న (4)తో కలిసి ఆడుకుంటూ ఉన్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రంజాన్ (39) ఇక్కడే గత కొన్నాళ్లుగా ఉంటున్నాడు. ఆటలాడుకుంటున్న పిల్లలను ఫోన్ ఇస్తానంటూ తన ఇంటిలోనికి తీసుకెళ్లాడు.
Warangal: చిన్నారితో ఆ దుండగుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎంత సేపటికీ పిల్లలు బయటకు రాకపోవడంతో ఆ పిల్లల నానమ్మ ఆ ఇంటిలోకి వెళ్లి బయటకు తీసుకొచ్చింది. ఏంజరిగిందో ఆ చిన్నారిని అడిగితే, వాచ్చీరాని మాటలతో ప్రైవేటు బాగాలను తాకాడని ఆ చిన్నారి తెలిపింది.
Warangal: వెంటనే ఆ దుండుగుడి ఇంటిపై బడి ఆ పిల్లల కుటుంబ సభ్యులు, స్థానికులు దాడి చేశారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారించిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఆ పిల్లల నానమ్మ చూడకపోయినా, ఆమె అందుబాటులో లేకపోయినా ఆ చిన్నారిపై ఆ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడేవాడు.
Warangal: ఆడపిల్లలకు రక్షణ ఉండటం లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ఎక్కడ ఉన్నా? ఏంజేస్తున్నా? ఆడపిల్లలపై ఇలాంటి దుండగులు రాక్షస చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. కఠిన మైన చట్టాలు ఎన్నున్నా? ఇలాంటి దురాఘతాలకు ఫుల్‌స్టాప్ పడకపోవడం శోచనీయం.