Minister Seethakka: వరంగల్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ అమానుష ఘటనపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం సంకల్పించిందని స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగింది?
వరంగల్ జిల్లా, ఖానాపురం మండలంలోని ఒక గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన నాలుగేళ్ల కుమార్తెను నాలుగు రోజుల క్రితం తన తల్లి (అమ్మమ్మ) వద్ద ఉంచి హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 25న అమ్మమ్మ చిన్నారిని గ్రామంలోని అంగన్వాడీ స్కూల్లో అప్పగించింది.
అంగన్వాడీ టీచర్ కుమారుడు (16 ఏళ్ల బాలుడు) ఉన్నాడు. తల్లికి బయ్యట పని ఉండటంతో కుమారుడికి అంగన్వాడీ బడిలో ఉన్న పిల్లలని చూసుకోమని చెప్పి బయటికి వెళ్లారు.. ఇదే అదునుగా చూసుకొని చిన్నారిని పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Crime News: తనను భార్య వదిలేసి వెళ్లిందని ఆటో డ్రైవర్ అమానుషం
అదే రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారి కడుపునొప్పి అంటూ ఏడ్వగా, అనుమానం వచ్చిన అమ్మమ్మ పరిశీలించగా రక్ట్రస్త్రావం ఇంకా గాయాలు కనిపించాయి వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్ చేర్పించారు.
విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మంత్రి సీతక్క ఆగ్రహం, ప్రభుత్వ ఆదేశాలు
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే మంత్రి సీతక్క స్పందించి, వెంటనే సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు.
“ఇలాంటి అమానుష ఘటనలు సమాజాన్ని కలచివేస్తాయి. చిన్నారుల భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికీ తావు ఉండదు,” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. చిన్నారి ఇంటికి చేరుకుని కుటుంబానికి అండగా నిలవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
బాధిత చిన్నారికి తగిన వైద్య మరియు మానసిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. “చిన్నారులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

