Prabhas: మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా నవంబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరో, హీరోయిన్ల జాబితాను ప్రకటించింది. ఇందులో హీరోల జాబితాలో ప్రభాస్ నిలువగా, హీరోయిన్ల జాబితాలో సమంత ఉన్నారు. విశేషం ఏమంటే… వీరిద్దరూ అక్టోబర్ నెలలోనూ టాప్ వన్ గా నిలిచారు. ప్రభాస్ ‘సలార్’ తర్వాత మరో విజయాన్ని ‘కల్కి 2898 ఎ.డి’తో అందుకోగా… ఇప్పుడా సినిమా జనవరి 3న జపాన్ లో విడుదల కాబోతోంది.
ఇది కూడా చదవండి: Ram Charan: రామ్ చరణ్ కు ఇండియాలోనే అతి పెద్ద కటౌట్
Prabhas: అలానే సమంత నటించిన వెబ్ సీరిస్ ‘సిటాడెల్’ కూ మంచి ఆదరణే లభిస్తోంది. దాంతో వీరిద్దరి వైపు నెటజన్స్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. హీరోల జాబితాలో టాప్ ఫైవ్ జాబితాలో ప్రభాస్ తర్వాత విజయ్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, ఎన్టీఆర్ నిలిచారు. అలానే హీరోయిన్లలో సమంత తర్వాత స్థానంలో వరుసగా అలియా భట్, నయనతార, సాయిపల్లవి, దీపికా పదుకొణే నిలవడం విశేషం.
మరోసారి వాయిదా పడ్డ ‘ఎర్రచీర’
Erra Cheera: సుమన్ బాబు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘ఎర్రచీర’. ఇందులో సుమన్ బాబు ఓ కీలకమైన పాత్ర కూడా చేశారు. కారుణ్య చౌదరి హీరోయిన్. విశేషం ఏమంటే… మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ‘ఎర్ర చీర: ద బిగినింగ్’లో ప్రముఖ నటుడు రాజేంద్ర పరసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్వినీ ఓ కీలక పాత్రను పోషించింది.
Erra Cheera: ఈ సినిమాలో 45 నిమిషాల పాటు గ్రాఫిక్ వర్క్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా… మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ముందుగా అనుకున్నట్టుగా ఈ నెల 27న కాకుండా జనవరి 1న మూవీని రిలీజ్ చేయబోతున్నారట. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను శ్రీరామ్, అయ్యప్ప పి. శర్మ, సురేశ్ కొండేటి, రఘుబాబు, కమల్ కామరాజ్ తదితరుల పోషించారు.