Hyderabad: హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ తాజాగా నిర్మిస్తున్న గోడను మంగళవారం అర్ధరాత్రి దాటాక దళిత సంఘాల ప్రతినిధులు కొందరు కూల్చివేశారు. అనంతరం విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ విగ్రహానికి ఓ చరిత్ర ఉన్నది.
Hyderabad: అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. అంతేగాకుండా ప్రజల సమస్యలపై తమ నిరసనను తెలపడానికి ఇదే విగ్రహాన్ని వేదికగా చేసుకుంటారు. ఇదే విగ్రహానికి వినతిపత్రాలు ఇస్తూ నిరసనను తెలుపుతారు. ఇలాంటి విగ్రహం చుట్టూ ఇటీవల ప్రభుత్వం గోడ నిర్మిస్తున్నది. అయితే ఇలాంటి కార్యక్రమాలను నివారించేందుకు ఇలా చేస్తున్నారనే ఉద్దేశంతో దళిత సంఘాలు గోడను కూల్చి నిరసన తెలిపినట్టు తెలుస్తున్నది.

