Chennai: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తన రాష్ట్రవ్యాప్త పర్యటనలను వాయిదా వేయాలని నిర్ణయించారు. కరూర్‌లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ స్పష్టంచేసింది.
టీవీకే ప్రకటన ప్రకారం, విజయ్ రాష్ట్ర పర్యటనలు రెండు వారాలపాటు వాయిదా వేయబడ్డాయి. ఈ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఆయన వచ్చే వారం కరూర్‌కు వెళ్లనున్నారు. అయితే, ఆయన పర్యటన పూర్తిగా పోలీసుల అనుమతితోనే జరగనుంది.
కరూర్ ఘటన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుఃఖం నెలకొన్న నేపథ్యంలో, విజయ్ పర్యటన వాయిదా నిర్ణయం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.