Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర దర్శకుడు వశిష్ఠ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు మాస్ మహారాజా రవితేజను లాక్ చేశారు. సోషియో ఫాంటసీ కథ రవితేజకు నచ్చడంతో ఈ కాంబో ఖరారైంది. గతంలో ‘దరువు’ లాంటి ఫాంటసీ కామెడీతో రవితేజ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఫాంటసి జోనర్లో ప్రయోగానికి సిద్ధం అయ్యారు.
Also Read: Bandla ganesh: నా మాటలు బాధపెడితే క్షమించండి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. యంగ్ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వశిష్ఠ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు మాస్ మహారాజా రవితేజను ఎంపిక చేశారు. వశిష్ఠ చెప్పిన సోషియో ఫాంటసీ కథ రవితేజకు నచ్చడంతో ఈ కాంబినేషన్ లాక్ అయింది. గతంలో రవితేజ ‘దరువు’ చిత్రంతో ఫాంటసీ కామెడీ జోనర్‌లో ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తరహా ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి వశిష్ఠ-రవితేజ కాంబో సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. రానున్న రోజుల్లో ఈ కాంబినేషన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయని సమాచారం.

