Virgin Boys

Virgin Boys: నవ్వుల జల్లు కురిపించేందుకు సిద్ధమైన ‘వర్జిన్ బాయ్స్’!

Virgin Boys: ఈ సమ్మర్‌లో నవ్వుల జల్లు కురిపించేందుకు సిద్ధమైన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ‘వర్జిన్ బాయ్స్’ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యువతను ఆకర్షించే కథతో, ఫన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మాతగా, దర్శకుడు దయానంద్ రూపొందిస్తున్న ఈ మూవీ పోస్టర్ ఒక్కసారి చూస్తే చాలు.. క్రేజీ వైబ్స్‌తో నవ్వు తెప్పిస్తుంది. గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా చేస్తుండగా, స్మరణ్ సాయి, మార్తాండ్ కె వెంకటేష్ వంటి టెక్నీషియన్స్ సాంకేతిక పరంగా బలం చేకూరుస్తున్నారు.

పోస్టర్‌లో ఓ అమ్మాయి పెదాలపై ముగ్గురు యువకులు.. ఒకరు కలర్‌ఫుల్ షార్ట్స్‌లో, ఒకరు స్కేట్‌బోర్డ్‌తో, మరొకరు మ్యాగజైన్‌తో నవ్వుతూ కనిపిస్తున్నారు. ‘బ్రో.. ఆర్ యు వర్జిన్?’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్ యూత్‌లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. హాస్యం, రొమాన్స్ మిక్స్‌తో ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. టాలీవుడ్ ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మూవీ యూనిట్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనుంది. ఈ సమ్మర్‌లో ‘వర్జిన్ బాయ్స్’ యూత్‌ని థియేటర్లలో నవ్వులతో ముంచెత్తేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

 

View this post on Instagram

 

A post shared by Mitraaw (@mitraaw_sharma)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tummala nageshwar rao: పాలమూరులో మూడు రోజులు రైతు సదస్సు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *