Virat Kohli: సెంచరీ పూర్తి... కోహ్లి కంట తడి

Virat Kohli: సెంచరీ పూర్తి… కోహ్లి కంట తడి

Virat Kohli: మూడేళ్ల సెంచరీ కరువు తొలగిపోయిన వేళ తన మానసిక స్థితి ఎలా ఉందో వివరించాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. 2022 సెప్టెంబర్లో వంద కొట్టి సంబరాలు చేసుకుంటూ భార్యతో మాట్లాడుతున్న అతని కళ్లల్లో నీళ్లు. ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా ఆ క్షణాలను గుర్తుచేసుకున్నాడు కోహ్లి.

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీ వీరుల జాబితాలో విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 100 సెంచరీలతో ముందుంటే…. కోహ్లి 80 సెంచరీలతో తర్వాతి స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ పై కోల్కతలో 2019 నవంబర్ లో సెంచరీ చేసిన తర్వాత మళ్లీ వంద కొట్టడానికి కోహ్లికి చాలా సమయం పట్టింది. అప్పట్లో అతని గణాంకాలు మరీ అంతగా పలుచన కానున్నా సెంచరీల్లేకపోవడంతో కోహ్లి పనైపోయిందంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. సుదీర్ఘ కాలం తర్వాత 2022లో కోహ్లి ఆసియా కప్ లో భాగంగా అఫ్ఘనిస్తాన్ పై సెంచరీ చేశాడు. 61 బంతుల్లో 122 పరుగులు సాధించిన ఆ క్షణాల్లో కోహ్లి భావోద్వేగాలకు గురయ్యాడు.

Virat Kohli: అనుష్కతో మాట్లాడుతున్నపుడు తాను ఏడ్చానని, రెండేళ్లుగా సెంచరీ లేక ఎంతగానో మనోవేదనకు గురయ్యానని గుర్తుచేసుకున్నాడు కోహ్లి. దుబాయిలో జరిగిన ఆ మ్యాచ్లో 6 సిక్సర్లు, 12 ఫోర్లు దంచి మరీ సెంచరీల కరువును తరిమివేశాడు విరాట్. భువనేశ్వర్ కుమార్ కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో ఆ మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది టీమిండియా. మూడేళ్ల సెంచరీ కరువు తీరిన వేళ…ఆ ఇన్నింగ్స్ ను తన భార్య అనుష్క, కూతురు వామికకు అంకితమిచ్చాడు విరాట్ కోహ్లి.

బయట చాలా రాద్ధాంతం జరుగుతోందని తెలుసు, ఆ సందర్భంలో నావైపు దన్నుగా నిలిచింది అనుష్క అందుకే భార్య, కూతురుకు ఆ ఇన్నింగ్స్ ను అంకితమిచ్చానన్నాడు స్టార్ బ్యాటర్. వన్డేల్లో సెంచరీల అర్థ సెంచరీ పూర్తిచేసిన విరాట్ టెస్టుల్లో 29 సెంచరీలు, ట్వంటీ20ల్లో 1 సెంచరీ కొట్టాడు. ఈ ఏడాదే జరిగిన ట్వంటీ20 వాల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచి కప్ అందించిన తర్వాత ఆ ఫార్మట్ కు వీడ్కోలు పలికాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *