Rithu Chowdary: టాలీవుడ్‌లో మరోసారి సంచలనం వార్త చక్కర్లు కొడుతోంది. జబర్దస్త్ ఫేమ్, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి పేరు ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమి తాజాగా విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం గౌతమి తన భర్త, టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కూడా ఆరోపణలు చేసింది. అయితే ఆ అమ్మాయి పేరు చెప్పని గౌతమి, ఇప్పుడు సంచలనంగా రీతూ చౌదరి పేరును బయటపెట్టింది.
గౌతమి షేర్ చేసిన వీడియోలలో ధర్మ మహేష్‌తో కలిసి రీతూ ఒక ఫ్లాట్‌లోకి వెళ్తున్న దృశ్యాలు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె షేర్ చేసిన చాట్స్‌లో “రీతూ గురించి అడిగితే నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్?” అనే సందేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య నిజంగా రిలేషన్ ఉందా? లేక వేరే కారణం కోసం కలిశారా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలయింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ‘ఓజీ’ చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది
ధర్మ మహేష్ విషయానికి వస్తే ఆయన సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరికి కుమారుడు పుట్టాడు. కానీ, అప్పటి నుండి ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి, తాజాగా ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఇక రీతూ చౌదరి పేరు ఈ వ్యవహారంలో రావడంతో టాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో చర్చలు మరింత తీవ్రం అయ్యాయి. గౌతమి చూపించిన వీడియోలు, సాక్ష్యాలు నిజమా? లేక వేరే ఉద్దేశంతో బయటపెట్టిందా? అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.
రీతూ చౌదరి వీడియో లీక్!
అర్ధరాత్రి.. డ్రగ్స్?#rithuchowdary #BiggBossTelugu9 #Biggboss9telugu #dharmamahesh #TV5News pic.twitter.com/Grh4s71cEe— Anil Reddy (@anil_reddy45) September 21, 2025