Viral News: సామాన్యంగా పెళ్లి అనగానే ఉత్సాహం, ఆనందం, కుటుంబసభ్యుల సందడి కనబడతాయి. కానీ తమిళనాడులోని కడలూర్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి మాత్రం అశ్రునయనాలతో జరిగింది. కన్నతండ్రి మృతదేహం ముందే ఓ కుమారుడు తన ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం గ్రామాన్ని కదిలించేసింది.
విరుధాచలం సమీపంలోని కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు, న్యాయ విద్య అభ్యసిస్తూ విరుధాచలంలోని కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విజయశాంతి అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇరు కుటుంబాల అనుమతితో వీరు త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Read: Canada: కెనడాలో కాల్పులు.. బుల్లెట్ మిస్ అయ్యి భారతీయ విద్యార్థిని మృతి
Viral News: అయితే వివాహానికి ముందే అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. కుటుంబం దుఃఖంలో ఉండగా, తండ్రి ఆశీస్సులతోనే వివాహం జరగాలని భావించిన అప్పు, తన ప్రేయసిని ఒప్పించి తండ్రి మృతదేహం ఎదుటే తాళి కట్టాడు. అంతిమయాత్రకు వెళ్లే ముందు తన తండ్రికి చివరి కానుకగా, ఆయన ఆశీస్సులు పొందాలన్న అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ భావోద్వేగా సంఘటన గ్రామంలో ప్రతి ఒక్కరిని కదిలించింది. తీవ్ర విషాద వాతావరణంలో అయినప్పటికీ అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు వారికి ఆశీర్వాదాలు అందించారు. అయితే వధువు తరఫున ఎవరూ ఈ వివాహానికి హాజరుకాలేదు. ఈ ఘటన గ్రామ స్థాయిలోనే కాకుండా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov
— Thanthi TV (@ThanthiTV) April 18, 2025

