Viral News: ఆ దేశంలో ఒక్క పౌరుని వద్ద సగటున నాలుగు ఆవుల చొప్పున ఉంటాయి. అందుకే ఆ దేశ జనాభాకు నాలుగింతలు ఆవులు ఉంటాయన్నమాట. ఆ ఆవులు కూడా ఎక్కడ తిరిగినా కనుక్కునేందుకు ఎలక్ట్రిక్ చిప్ తో ఈజీగా కనుక్కోవచ్చు. వ్యవసాయంలో కూడా ఆ దేశం ఎంతో ముందు ఉన్నదని చెప్పేందుకు ఎన్నో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న అంశాలు ఉన్నాయి. ఆ దేశమే ఉరుగ్వే.
Viral News: వ్యవసాయంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఉరుగ్వే దేశంలో సగటున ప్రతి ఒక్క పౌరుని వద్ద నాలుగు ఆవుల చొప్పున ఉంటాయి. ఆ దేశంలో కేవలం 33 లక్షల జనాభా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.20 కోట్లకు పైగా ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల చెవికి ఎలక్ట్రానిక్ చిప్ బిగించి ఉంటుంది. అది ఎక్కడ ఉన్నదో ఆ చిప్ ద్వారా దాని యాజమానికి కనుక్కుంటాడు.
Viral News: అదే విధంగా ఆ దేశంలో రైతు యంత్రం ద్వారా పంటను కోస్తుండగా, ఆ యంత్రం మరో పక్కన ఆధాన్యం పరిమాణం ఒక స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ పరిమాణం ఆధారంగా రైతు ప్రతి చదరపు మీటరుకు ఎంత పంట పండిందో ఆ రైతు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు సరైన చర్యలు తీసుకుంటూ ఉంటారు.
Viral News: ఉరుగ్వే జాతీయ ప్రగతి చిహ్నం ఆవు, గుర్రం. ఆ దేశంలో ఆవును చంపితే వెంటనే మరణశిక్ష అనే చట్టం అమలవుతుంది. ఆవును ప్రేమించే దేశంగా గుర్తింపు పొందింది. మరో విశేషమేమిటంటే ఆ ఆవు సంపద అంతా భారతీయ సంతతికి చెందినదే కావడం. వీటిని ఇండియన్ కౌ అని కూడా సంబోధిస్తూ ఉంటారు అక్కడి రైతులు.
Viral News: పాలు, పెరుగు, నెయ్యి, వెన్నతో పాటు వారి జనాభాకు ఎన్నో రెట్లు పంటలు పండించడం ఆ దేశ రైతుల ప్రత్యేకత. అందుకే ఆ దేశం నుంచి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇతర ధాన్యాలు ఎగుమతి చేస్తారు. అందుకే ప్రతి రైతు లక్షల్లో ఆదాయం పొందుతాడని చెప్తారు. ఒక రైతు కనీస ఆదాయం ప్రతి నెలకు రూ.1,20,000 అంటే 190000 డాలర్లుగా ఉంటుందట. చూశారా? వ్యవసాయం, అనుబంధంగా పాడి పరిశ్రమతో ఉరుగ్వే దేశంలో రైతు రాజుగా బతుకుతున్నాడన్న మాట.

