Viral News: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం అతడి ఉద్యోగానికే ఎసరొచ్చింది. ఓ మంత్రి అనుచరుడిగా పేరున్న అతను దౌర్జన్యానికి దిగాడు. చేసే ఉద్యోగ బాధ్యతలను వదిలి సైడ్ బిజినెస్ చేస్తూ దందాలకు రుచి మరిగాడు. ఓ దుకాణదారుడిపై ఏకంగా దౌర్జన్యానికే దిగాడు. నోటితో చెప్పలేని దుర్భాషలాడుతూ వీరంగం ఆడి బెదిరింపులకు దిగాడు.
Viral News: ఓ పోలీస్ అధికారితో ఫోన్‌లో మాట్లాడుతూ ఆ దుకాణదారుడిపై తిట్ల దండకం అందుకున్నాడు. చేసే కొలువు వదిలి సైడ్ బిజినెస్ కోసం వెళ్తే ఏకంగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు. “మహాన్యూస్”తోపాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అతని నిర్వాకం వెలుగులోకి రావడంతో అతనిపై చర్యలకు ఉపక్రమించారు.
Viral News: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఓ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్న ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రస్తుతం డిప్యూటేషన్‌పై జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. దసరా, దీపావళిని పురష్కరించుకొని ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖమ్మంలో క్రాకర్స్ దుకాణం పెట్టాడు.
Viral News: తన దుకాణానికి ఎదురుగా పాల్వంచ నుంచి వచ్చిన ఓ యువకుడు క్రాకర్స్ దుకాణం పెట్టాడు. ఇది జీర్ణించుకోలేని ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ దుకాణంలోకి వెళ్లి, ఆ దుకాణదారుడిపై దౌర్జన్యానికి దిగాడు. తీవ్రమైన దుర్భాషలాడుతూ, మెయిన్ ఫ్యూజ్ తీసుకొని, ఇష్టారీతిన తిట్లదండకంతో బెదిరింపులకు దిగాడు. ఎక్కడి నుంచో వచ్చి మా షాపుకు ఎదురుగా ఎలా దుకాణం పెడతావంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral News: ఆ దుకాణం విషయంలోనే ఓ పోలీస్ అధికారికి అదే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాల్ చేశాడు. ఆ దుకాణాన్ని తొలగించాలంటూ బెదిరింపులకు దిగాడు. తాను తన అనుచరులను పంపి గొడవ చేస్తానంటూ డమ్కీలు ఇచ్చాడు. ఆ ఫోన్ కాల్‌లో కూడా ఆ దుకాణదారుడిని తీవ్రంగా దుర్భాషలాడాడు. ఆ పోలీస్ అధికారి ఎంతగా చెప్తున్నా వినకుండా బెదిరింపులతోనే మాట్లాడాడు.
Viral News: పోలీస్ అధికారితో మాట్లాడిన ఆడియో కూడా లీక్ అయి వైరల్‌గా మారింది. ఈ రెండు ఘటనలు కలకలం రేపాయి. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయి ఉండి ఇలా బెదిరింపులకు పాల్పడటంపై జిల్లా అంతటా విస్మయం వ్యక్తమైంది. ఓ మంత్రి అండ చూసుకొని ఇలా వ్యవహరించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా ప్రజలతో పాటు ఉపాధ్యాయ లోకం కూడా ఈసడించుకున్నది.
Viral News: ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకంపై జిల్లా విద్యాశాఖాధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అయిన డాక్టర్ పీ శ్రీజ స్పందించారు. చేయాల్సిన విధులు వదిలి గొడవలో పాల్గొన్నందుకు అతనిని సస్పెండ్ చేస్తూ ఆమె ఉత్తర్వులను జారీ చేశారు. సైడ్ బిజినెస్ కోసం వెళ్తే ఉన్న ప్రభుత్వ ఉద్యోగం పోయింది.. అంటూ పలువురు నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.