Viral News: ఔను.. అది కావు కావుమని అరిచే కాకే.. నల్లగొండ జిల్లాలో ఓ పశువుల ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం ఓ కుటుంబం తీసుకొచ్చింది. ఎంచక్కా ఆ ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్యచికిత్సలు అందించారు. వైద్యం చేస్తున్నంత సేపు ఎటూ వెళ్లకుండా ఉన్నది. అసలు దానికి వచ్చిన అనారోగ్యం ఏమిటంటే? గత రెండు రోజులుగా సరిగా ఆహారం తీసుకోవడం లేదట. ఏమిటా కాకి కథ.. ఏమిటా విషయం.. చూద్దాం రండి..
Viral News: నల్లగొండ జిల్లాలో దేవరకొండ పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్, సాఫియా దంపతులు ఇంటిలో ఒక ఏడాదిగా ఓ కాకి కలిసి ఉంటున్నది. ఉదయం వచ్చిన ఆ కాకి సాయంత్రం వరకూ ఆ కుటుంబ సభ్యులతోనే ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా తమలో ఒకటిగా చూస్తూ, నిత్యం ఆహారాన్ని అందిస్తూ వస్తున్నారు. తాము తినే అన్నం, చికెన్‌ను ఆ కాకికి ఆహారంగా అందజేస్తూ ఉంటారు. సాయంత్రం పొద్దుపోయాక వెళ్తుంది. మళ్లీ తెల్లారే ఆ ఇంటికి చేరుకుంటుంది.
Viral News: ఏడాదిగా యూసుఫ్, సాఫియా కుటుంబంతో మమేకమైన ఆ కాకికి అనుకోకుండా గత రెండు రోజులుగా అనారోగ్యం దరిచేరిందో, మరేదైనా ఇబ్బంది కలిగిందో కానీ, ఆహారం తీసుకోవడం లేదు. రోజు తామిచ్చే ఆహారం తినే కాకి రెండు రోజులుగా ఏమీ తీసుకోకపోవడంతో బాధపడిన ఆ కుటుంబం.. దానిని సమీపంలోని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Viral News: ఓ బుట్టలో ఉంచి ఆ కాకిని తీసుకెళ్లారు ఆ దంపతులు. సాదు జంతువు వోలే ఎగరకుండా ఉన్న ఆ కాకికి అక్కడి వైద్య సిబ్బంది పరీక్షించారు. దానికి సరైన వైద్యచికిత్సలు చేసి పంపించేశారు. మనం నిత్యం పెంచే కోడి కూడా మనం చెప్పినట్టు ఓ బుట్టలో వేసి ఉంచితే ఎగిరి పోతుంది. అలాంటిది ఓ బుట్టలో ఉండు అనగానే అలాగే పడుకొని ఉన్న ఆ కాకి వినయం చూస్తే అక్కడ చూసిన వారికి అబ్బురమనిపించదా మరి.

