Viral News: ఈ చిత్రం అరటి రైతు బతుకు చిత్రానికి అద్దం పడుతుంది. ఇది ఏ ఒక్క రైతుకు జరగవద్దని కోరుకుంటున్నా.. నిన్న టమాట, మొన్న మిరప.. ఈరోజు పత్తి, అరటి రైతులు దయనీయ పరిస్థితిలో మగ్గుతున్నారు. ప్రకృతి ప్రళయాలతో ఓ రకంగా, మార్కెట్ వ్యవస్థ సరిగా లేక మరో రకంగా, పాలకుల అసహాయతతో ఇంకో రకంగా రైతు ఇలా నష్టాలపాలవడం తరచూ జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ఈ అరటి రైతుల వంతు వచ్చింది.
Viral News: సామాన్యుల ఇళ్లలో అరటి పండు అమృతం లాంటిది. ప్రతి ఇంటా ఆ పండ్లు తినడం నిత్యకృత్యం. దీంతో నగరాలు, పట్టణాలు, పల్లెల్లో అరటి పండ్ల ధరలు అమాంతం పెరిగాయి. అయినా ఆ పెరిగిన ధరలతోనే జనం ఆరగించేస్తున్నారు. అయితే అదే అరటిని పండించే రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.
Viral News: మూడేళ్లుగా టన్ను అరటి ధర రూ.25 వేలు పలుకగా, ఈ సారి అదే అరటి ధర కేవలం రూ.1,000లోపే పడిపోయింది. దీంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కిలో అరటికి 6, 7 కాయలు వస్తాయి. అంటే రెండు కేజీలు అయితే ఒక డజను. బయట మార్కెట్‌లో డజను అరటి రూ.40 నుంచి రూ.60కి అమ్ముతున్నారు.
Viral News: ఈ లెక్కన అరటి రైతుకు కిలో ఒక్కంటికి 1 రూపాయి మాత్రమే పలుకుతుంది. అదే డజను ఒక్కంటికి 2 రూపాయలు పలుకుతుంది. ఇలా వారి పరిస్థితి దిగజారడంతో అరటి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెడితే కనీసం ఆ పెట్టుబడులు కూడా వెళ్లని పరిస్థితి దాపురించింది. కడుపు మండిన రైతులు వచ్చే ఆ రెండు రూపాయలకు అమ్మలేక ఇంట్లో ఉండే పశువులు, మేకలకు అరటి కాయలను దానాగా వేసి బావురుమంటున్నారు.

