Viral News: ప్రపంచంలో ఇదో అరుదైన విషయం. కాలక్రమేణా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నాగరికతలు వెలిశాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రాచీన పోకడలు పోయాయి. ఆధునిక జాడలు నిత్యం మెరుస్తున్నాయి. ఇదే దశలో ఓ దేశమే అంతర్థానం కానున్నది. కాలక్రమేణా ఆ దేశం సముద్రంలో కనుమరుగై పోతున్నది. అలాంటి స్థితిలో ఉన్న ఆ దేశస్థులకు మరో దేశం ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకుంటున్న అరుదైన విషయం మనం తెలుసుకుందాం.
Viral News: ఆస్ట్రేలియా ఖండానికి సమీపంలో సముద్రంలో వ్యాపించి ఉన్నది తువాలు (Tuvalu) దేశం. ఇది ఆ దేశానికి పొరుగునే ఉంటుంది. సముద్రంలో కనుమరుగు అవుతున్న ఆ దేశ పౌరులకు ఆస్ట్రేలియా దేశం ఆశ్రయం కల్పించే అంశంపై చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీంతో తువాలు దేశం నుంచి వసలదారుల బృందం తొలి విడత తాజాగా ఆస్ట్రేలియాలో అడ్డుగుపెట్టింది. వారందరినీ గౌరవప్రదంగా చూసుకునేందుకు అక్కున చేర్చుకున్నది.
Viral News: తొలుత ఆస్ట్రేలియా దేశంలో అడుగు పెట్టిన వెంటనే తువాలు వలసదారులకు విద్య, వైద్యబీమా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆ దేశ ప్రభుత్వం అమలు చేస్తుంది. అంతరించి పోతున్న తువాలు దేశం నుంచి ఎందరో విదేశాలకు వెళ్లిపోసాగారు. చివరకు సుమారు 11 వేల జనాభా మాత్రమే ఇప్పుడు తువాలు దేశంలో నివాసం ఉంటున్నారు. 2025 జూన్‌లోనే వీసా దరఖాస్తులు ప్రారంభం కాగా, తొలి విడత 3,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే తువాలులో మేధో వలసను నివారించేందుకు ఏటా కేవలం 280 మందికి మాత్రమే వీసాలు జారీ చేయాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించారు.
Viral News: వాతావరణ మార్పుల వల్ల సముద్రజలంతో ముంపునకు గురవుతున్న తమ దేశానికి గౌరవప్రదమైన వలసవాదులుగా అవకాశం కల్పించాలని తొలుత తువాలు దేశ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు 2023వ సంవత్సరంలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు ఆస్ట్రేలియా దేశం తువాలు పౌరులకు ప్రత్యేక వీసాలను జారీ చేస్తున్నది. ఆ వీసా ద్వారా వారు ఆస్ట్రేలియాలో నివాస హక్కును పొందుతారు. అక్కడే చదువుకోవచ్చు. పనిచేసుకోవచ్చు. అర్హత సాధించిన వారికి విడతల వారీగా ఆస్ట్రేలియా పౌరసత్వం అందజేస్తారు.

