Vikatakavi Review: తెలుగులో డిటెక్టివ్ థ్రిల్లర్స్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇక ఓటీటీలో సిరీస్ ల విషయానికి వస్తే ఎప్పుడో కానీ రావు . వచ్చినవి కూడా రకరకాల నేపథ్యంలో సీరియస్ మోడీ లో సాగిపోతూ ఉంటాయి . కానీ , ప్రస్తుతం ఒక సిరీస్ ఈ కోణంలో అందరినీ అలరించడానికి వచ్చేసింది . అదే వికటకవి .
వికటకవి 1970ల తెలంగాణా గ్రామీణ ప్రాంతాన్ని నేపథ్యంలో ఉంచుకొని తెరకెక్కిన డిటెక్టివ్ థ్రిల్లర్. ప్రారంభ సన్నివేశం నుంచే, దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆడియన్స్‌ను ఆసక్తికరమైన విజువల్స్ మరియు అద్భుతమైన నటనలతో ఆకట్టుకోవడంలో విజయం సాధించారు.
Vikatakavi Review: ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అందించిన రాజీ లేని నిర్మాణ విలువలు ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తాయి. ఆడియన్స్‌ను అమరగిరి అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో వాటి పాత్ర అపారమైంది. వికటకవి ఒక సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా, రచయిత తేజ దేశరాజ్ కధలో అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేశారు.
అజయ్ అరసాడ ఈ సిరీస్‌కు అత్యద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. డీఓపీ షోయబ్ సిద్దీఖీ అమరగిరి ప్రపంచాన్ని అద్భుతంగా చూపించడంలో విశేష ప్రతిభ చూపారు. కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి దేవి మరియు ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ మామిడి వారి పనితీరుతో ఆకట్టుకున్నారు. ఎడిటర్ సాయిబాబు తలారి తన క్రిస్ప్ కట్‌లతో కథనానికి సరైన రితిలో వేగం అందించారు.
నరేశ్ అగస్త్య డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో జీవించారు. ఆ క్లిష్టమైన పాత్రను చాలా సులభంగా స్వీకరించి, రామకృష్ణ పాత్రను మరచిపోలేని విధంగా ఆవిష్కరించారు.
షిజు తన ప్రతిభతో తన జీవితంలోని ప్రతి దానిని కోల్పోయిన వయసైన రాజా నరసింహరావు పాత్రలో ప్రాణం పోశారు.
రఘు కుంచె, మేఘా ఆకాష్, అలాగే ఇతర నటులు తమ పాత్రలను సంపూర్ణంగా నెరవేర్చారు.
Vikatakavi Review: సాధారణంగా వెబ్ సిరీస్ అంటే విపరీతమైన సాగదీతతో ఉంటాయి. కానీ , వికటకవి అందుకు భిన్నంగా సాగుతుంది . ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ మొదటి నాలుగు ఎపిసోడ్స్ వేగంగా సాగిపోతూ ఉత్కంఠను రేకెత్తిస్తాయి . చివరి రెండు ఎపిసోడ్స్ కాస్త నిదానించినా . . చివరికి మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి .
అంత భారీ స్థాయిలో కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌లో చిత్రీకరించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి విజయం సాధించారు.
వికటకవితో జీ5 ఇటీవల కాలంలో ఉత్తమ తెలుగు సిరీస్‌లను అందించడంలో ముందడుగు వేసింది. ఈ వీకెండ్ తప్పనిసరిగా చూడవలసిన సిరీస్‌గా ఇది నిలుస్తుంది.