Vijayawada: ప్రయాణికులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించే రైల్వేస్టేషన్లకు ప్రతి ఏటా రైల్వే శాఖ ఈట్ రైట్ స్టేషన్‌గా గుర్తిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ రైల్వేస్టేషన్‌కు దేశంలోనే అరుదైన గుర్తింపు దక్కడం విశేషం. రైలు ఎక్కే, దిగే ప్రయాణికులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతపై ఇది ఆధారపడి నిర్ధారిస్తారు. తాజాగా ఆ ధ్రువీకరణ పత్రాన్ని రైల్వే అధికారులు అందజేశారు.
Vijayawada: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా రైల్యేశాఖ ప్రత్యేక తనిఖీలు చేయిస్తుంది. లోపాలు సరిదిద్ది, నిర్ధిష్ఠమైన ప్రమాణాలు పాటించేలా ఆయా స్టేషన్లను ప్రోత్సహిస్తుంది. ఆరు నెలల ప్రీ ఆడిట్‌లో భాగంగా సిబ్బంది విజయవాడ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసి లోపాలను సరిదిద్దారు. ఆ తర్వాతే ధ్రువీకరణ పత్రం జారీ చేసి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ ఆరునెలల కాలంలో ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ సేకరిస్తుంది.
Vijayawada: రైల్వే శాఖ పరీక్షలో 85 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి విజయవాడ రైల్వేస్టేషన్ ఆదర్శప్రాయమైన ప్రామాణిక 5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికెట్‌ను సాధించింది. ఈ మేరకు డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ విజయవాడ రైల్వేస్టేషన్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Vijayawada: దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వే జంక్షన్ ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. కీలకమైన 300 రైళ్లు ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తాయి. ఇంతటి ప్రముఖ రైల్వేస్టేషన్‌కు ఈట్ రైట్ స్టేషన్ గుర్తింపు దక్కడం విశేషం.