Sai Krishna Case: విజయవాడకు చెందిన సాయికృష్ణ అనుమానాస్పదc మృతి (లాకప్ డెత్) వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ కస్టడీలో ఉండాల్సిన పౌరుడు ఆచూకీ లేకుండా మాయం కావడం, మరణించడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని, చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న విచారణపై తక్షణ స్టే విధించింది. అంతేకాకుండా, రాష్ట్రంలో ఈ అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం – ప్రతివాదులకు నోటీసులు..
ఈ కేసు తదుపరి సమగ్ర విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం, దర్యాప్తు బృందాలు సీల్డ్ కవర్‌లో సమర్పించే నివేదికలను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు తుది ఆదేశాలు లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థకు బాధ్యతలు అప్పగించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగంలో, ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.
