Vijay Rally Stampede

Vijay Rally Stampede: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు.. రూ. 20 లక్షలు టీవీకే పరిహారం

Vijay Rally Stampede: తమిళనాడులోని కరూర్‌ కన్నీరముగుతోంది. ప్రజలు తమ అభిమాన హీరో, ఇప్పుడు రాజకీయ నాయకుడైన టీవీకే అధినేత విజయ్‌ను చూడటానికి పోటెత్తారు. కానీ ఆ అభిమానం విషాదంలోకి మారింది. శనివారం రాత్రి జరిగిన రోడ్‌ షోలో తొక్కిసలాట జరిగి మృతుల సంఖ్య ఒక్కో క్షణం పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ఉన్నారు. అదనంగా 95 మందికి పైగా గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

విజయ్ స్పందన – విరిగిన మనసు

ఈ ఘటనపై టీవీకే అధినేత విజయ్ గుండె పగిలిందని, ఈ బాధను మాటల్లో చెప్పలేమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ‘‘మీ ముఖాలన్నీ నా మదిలో తిరుగుతున్నాయి. నాపై చూపిన ప్రేమను ఇంతలా విషాదంగా మలిచిన ఈ ఘటన భరించలేనిది’’ అంటూ ఆయన హృదయానికి హత్తుకునేలా స్పందించారు.

ఇది కూడా చదవండి: TGPSC UPDATES: త్వ‌ర‌లో ఆ ఉద్యోగాల భ‌ర్తీ జాబితా! టీజీపీఎస్సీ క‌స‌ర‌త్తు!

బాధితులకు ఆర్థిక సాయం

ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలుస్తానని విజయ్ హామీ ఇచ్చారు. ‘‘ఈ డబ్బు వారి కోల్పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వలేదుగానీ, భారమైన మనసుతో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు తోడుగా ఉంటాను’’ అని ఆయన చెప్పారు.

దేశవ్యాప్త దృష్టి

కరూర్‌లో చోటుచేసుకున్న ఈ విషాదం తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా విషాదం నింపింది. అభిమాన సభ మృత్యువుకు వేదిక కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *