Vijay Rally Stampede:నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కారు. తమిళనాడులోని కరూర్‌లో నిన్న తన సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ సభలో తొక్కిసలాట జరిగి 39 మంది చనిపోయారు. మరో 50 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు టీవీకే రూ.20 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికసాయం ప్రకటించింది.
Vijay Rally Stampede:అయితే ఈ తొక్కిసలాట ఘటన కావాలనే జరిగిందని టీవీకే అధినేత, నటుడు విజయ్ ఆరోపించారు. జనం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నా విశాల స్థలం ఇవ్వకుండా, ఇరుకైన స్థలాన్ని సభకు అనుమతి ఇచ్చారని తెలిపారు. అదే విధంగా కావాలనే పోలీసులు లాఠీచార్జి చేయడం వల్లే తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్నదని ఆరోపించారు. ర్యాలీపై కొందరు కావాలనే రాళ్లు రువ్వారని తెలిపారు.
Vijay Rally Stampede:అందుకే ఈ ఘటనపై కుట్రకోణం దాగి ఉన్నదని, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ టీవీకే అధినేత, నటుడు విజయ్ మద్రాస్ హైకోర్టును కోరారు. తన నివాసంలో పలువురు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న టీవీకే విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి దండపాణి అంగీకరించారు.
Vijay Rally Stampede:కోర్టుకు సెలవులు ఉన్నా సోమవారమే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, ఇప్పటికే విజయ్ మినహా టీవీకే క్యాడర్‌పై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేసులను నమోదు చేసింది. అదే విధంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో విచారణకు జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది.
Vijay Rally Stampede:కరెంట్ పోయిందని, విజయ్‌పై చెప్పలు విసిరారని టీవీకే ఆరోపించింది. సభకు అనుమతి విషయంలోనూ పక్షపాత ధోరణిని ప్రభుత్వం పాటించిందని ఆ పార్టీ ఆరోపించింది. టీవీకే ఆరోపణలు తమిళనాడు డీజీపీ ఖండించారు. అనుమతించిన దానికంటే అధికంగా జనం వచ్చారని, సభకు విజయ్ చాలా ఆలస్యంగా వచ్చారని, ఇప్పుడు పోలీసులపైకి నెపం నెడుతున్నారని అభ్యంతరం తెలిపారు.