Kingdom

Kingdom: ‘కింగ్‌డమ్’పై విజయ్ దేవరకొండ క్రేజీ అప్డేట్!

Kingdom: టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతోన్న చిత్రాల్లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ ఒకటి. ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచింది. ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని, ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిందని విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించారు.

దర్శకుడు గౌతమ్‌తో చర్చిస్తున్న ఫోటోను కూడా షేర్ చేసిన విజయ్, ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపారు.ఇప్పటికే విడుదలైన ‘కింగ్‌డమ్’ టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విజయ్ దేవరకొండ పాత్ర ఈ చిత్రంలో సరికొత్త లెవెల్‌లో ఉంటుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

Also Read: Coolie: కూలీ: కైపెక్కిస్తున్న పూజా హెగ్డే!

Kingdom: ఈ చిత్రంలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *