Kingdom: టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్డమ్’ ఒకటి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘హృదయం లోపల’ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో రిలీజై, అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పూర్తి రొమాంటిక్ సాంగ్ ప్రోమోలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సెల మధ్య ముద్దులతో కూడిన సిజ్లింగ్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.
Also Read: Hit 3 Twitter Review: హిట్ 3 ట్విట్టర్ రివ్యూ… థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉందంటే..?
Kingdom: అనిరుధ్ రవిచందర్ తన సంగీతంతో మరోసారి మాయాజాలం చేస్తున్నాడు. ‘హృదయం లోపల’ పాటను ఆయన పాడిన తీరు ఆకట్టుకుంటోంది. మే 2న ఈ సాంగ్ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, విజయ్-భాగ్యశ్రీల రొమాన్స్ ఏ స్థాయిలో ఆకర్షిస్తుందనే ఆసక్తి నెలకొంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ‘కింగ్డమ్’, మే 30న గ్రాండ్ రిలీజ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయనుంది.
కింగ్డమ్ హృదయం లోపాల సాంగ్ ప్రోమో :

