AP Rice Mafia: మహాన్యూస్ గతంలో చెప్పిన విషయం నిజమని స్పష్టంగా తేలింది. రైస్ మాఫియా కాకినాడ పోర్టు నుంచి విశాఖ పోర్టుకు మరలుతోందంటూ దాదాపు మూడు నెలల క్రితమే మహాన్యూస్ కథనాలను వెలువరించింది. ఈ నేపథ్యంలో తాజాగా సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 480 టన్నుల పీడీఎఫ్ బియ్యం ఎగుమతికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు దానిని సీజ్ చేశారు.
AP Rice Mafia: రైస్ మాఫియా డాన్ అగర్వాల్ నేతృత్వంలో కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యం తరలిపోతున్న విషయం గతంలో బయటపడింది. మంత్రి నాదెండ్ల మనోహర్ మొదటి నుంచి అగర్వాల్, ద్వారంపూడిల రైస్ దందాపై ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. కాకినాడ పోర్టులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున పీడీఎఫ్ బియ్యం పట్టుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు అగర్వాల్ బ్యాచ్ బియ్యం రవాణాకు విశాఖ పోర్టును ఎంచుకుంది. ఈ విషయం మంత్రి ఆకస్మిక తనిఖీల్లో స్పష్టం అయింది. దొరికిన బియ్యం AGF కంపెనీకి సంబంధించినదిగా గుర్తించారు అధికారులు. కంపెనీ నుంచి వివరణ అడిగారు.
AP Rice Mafia: మొత్తంగా చూసుకుంటే.. ఇంత గట్టిగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా.. మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగి పేదల బియ్యం మాఫియా పాలు కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా.. ఈ మాఫియా సరికొత్త దారులు వెతుక్కుంటోంది. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టులో బియ్యం సీజ్ చేయడంతో ఇప్పుడు మాఫియా డాన్ కు చెమటలు పడుతున్నాయి. పేదల బియ్యం విషయంలో ఎన్ని ఎత్తులు వేసినా ఎటువంటి పరిస్థితిలోనూ వదిలేది లేదు అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంగా అందరికీ హెచ్చరిక చేస్తున్నారు.