Big Twist In AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మద్యం కుంభకోణం కేసు రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్‌లో తాజాగా వైసీపీకి చెందిన చెవిరెడ్డి సమీప సహచరుడు వెంకటేష్ నాయుడు ముఖ్య పాత్రలో ఉన్నట్లు వెల్లడైంది. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి బయటపడ్డ ఓ వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
వీడియోలో వెంకటేష్ నాయుడు ఒక గదిలో కరెన్సీ నోట్లు లెక్కిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. టేబుల్ పైన భారీగా నోట్ల కట్టలు ఉండగా, వాటిని వెంకటేష్ నాయుడు తన చేతుల్తో లెక్కించటం వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను SIT అధికారులు అతని ఫోన్ నుంచి రికవర్ చేశారు.
ఈ స్కామ్‌లో ఇప్పటికే రూ.11 కోట్లు నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని శనివారం బ్యాంకులో డిపాజిట్ చేశారు. నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని, వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని ఏసీబీ కోర్టు SIT అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇంతవరకూ “నాకు లిక్కర్ వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు” అని చెవిరెడ్డి చెప్పుకుంటూ వస్తుండగా, ఆయన అత్యంత నమ్మకస్తుడు వెంకటేష్ నాయుడు నేరుగా మద్యం ముడుపుల డెన్‌లో కనిపించడంతో, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం, ఈ వీడియో కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది.
ఇకపై ఈ కేసు మరింత వేడెక్కే అవకాశం ఉంది. వీడియో బయటకు రావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వైసీపీకి భారీ ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.