AAA Mahaa Sabhalu: అమెరికాలో తెలుగు ప్రజల సంస్కృతీ బంధాన్ని మరింత గాఢంగా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) సరికొత్త ఈవెంట్స్ తో మన ముందుకు వస్తోంది. అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రజలకు మన సంప్రదాయ మూలలను చెదిరిపోని బంధంగా నిలిచేలా చేయడమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇంటికి దూరంగా ఎక్కడో సప్త సముద్రాల అవతల వివిధ కారణాలతో జీవిస్తున్న తెలుగు ప్రజలను మన పండుగలు.. వేడుకలు.. సంప్రదాయాల దారాలతో ఒక్క చోటికి చేరుస్తూ వస్తోంది AAA. ఇప్పుడు AAA మొదటి మహా సభలను నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. ఈ సందర్భంగా AAA మన సంప్రదాయాలలోని గొప్పతనాన్ని అందరూ మనస్సులో నింపుకునేలా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.
AAA Mahaa Sabhalu: మన అతివల కోసం ముగ్గుల పోటీలు.. సంగీతం అంటే చెవికోసుకునే వారి కోసం సంగీత పోటీలు, చిన్నగా ఉన్నా ఆకట్టుకునేలా తీసిన లఘుచిత్రాల పోటీలు, ఈ తరం మెచ్చుకునేలా చేసిన ఇన్ స్టా గ్రామ్ రీల్స్ పోటీలు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.
ముగ్గుల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ.25,00,116లు, రెండో బహుమతిగా రూ.15,00,116లు, మూడో బహుమతిగా రూ.10,00,116లు, నాలుగో బహుమతిగా రూ.5,00,116లు, ఐదో బహుమతిగా రూ.2,00,116లు ఇవ్వనున్నారు. అంతే కాకుండా 100మందికి AAA ట్రోఫీ, సర్టిఫికెట్ లతో బాటు రూ.10,116లు అందచేయనున్నారు. ఈ పోటీలకు జ్యురి హెడ్ గా లావణ్య మోటుపల్లి వ్యవహరించనున్నారు. ఇక న్యాయ నిర్ణేతలుగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గౌరవ జడ్జి వై.సురేష్, రిటైర్డ్ ఐపీఎస్ అదిఆకృ జె.సత్యనారాయణ, వ్యాపారవేత్త ప్రియా ఆచంట ఉన్నారు.
AAA Mahaa Sabhalu: ఇక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన సినిమాకు రూ.15,00,116లు, రెండో స్థానంలో నిలిచిన సినిమాకు రూ.10,00,116లు అందిస్తారు. అంతేకాకుండా 100మందికి AAA ట్రోఫీ, సర్టిఫికెట్ లతో బాటు రూ.10,116లు అందచేయనున్నారు. షార్ట్ ఫిలిం కాంటెస్ట్ జ్యురీ హెడ్ గా రవి మందలపు వ్యవహరిస్తారు. ఆయనతో పాటు నటుడు విరాజ్ అశ్విన్, డైరెక్టర్ ఎం.వీరభద్రం, నటుడు లోహిత్ అకవరం, సినీ రచయితా వెంకట్ మాగులూరి న్యాయనిర్ణేతలుగా ఉంటారు.
అలాగే ప్రపంచ వ్యాప్త రీల్స్ పోటీల్లో మొదటి స్థానం పొందిన రీల్ కు రూ.10,00,116లు, రెండో రీల్ కు రూ.7,00,116లు, మూడో రీల్ కు రూ.4,00,116లు బహుమతిగా అందిస్తారు. అలాగే 50మందికి AAA ట్రోఫీ, సర్టిఫికెట్ లతో బాటు రూ.10,116లు ఇస్తారు. శ్వేతా వాసగిరి జ్యూరీ హెడ్ గా వ్యవహరిస్తారు. నటి దివి, నటుడు వంశీరామ్ పెండ్యాల, టీవీ యాంకర్ భాను శ్రీ, సినీ నటి జాను న్యాయనిర్ణేతలుగా ఉంటారు.
AAA Mahaa Sabhalu: అదేవిధంగా ప్రపంచ సంగీత పోటీలు 2025 లో విజేతకు రూ.7,00,116లు, రెండో స్థానం పొందిన వారికి రూ.4,00,116లు ఇస్తారు. అంతేకాకుండా పోటీల్లో ప్రతిభ చూపిన 50 మందికి AAA ట్రోఫీ, సర్టిఫికెట్ లతో బాటు రూ.10,116లు అందిస్తారు. ఈ పోటీలకు జ్యురీలుగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి (డాక్టర్ కోటి సాలూరి), గాయనీమణులు శౌర్య మంత్రిప్రగడ, నిత్య సంతోషిణి, నటి దివి, నిర్మాత షాని సాల్మన్ వ్యవహరిస్తారు.
AAA Mahaa Sabhalu: ముగ్గుల పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం వారికోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. జనవరి 15, 2025 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో https://nationalconvention1.theaaa.org/index.html వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ లో వీడియో సబ్మిట్ చేయడం ప్రారంభం అయింది. జనవరి 15, 2025లోపు వీడియోలు పంపించవచ్చు. అదేవిధంగా పోటీలకు షార్ట్ ఫిలిమ్స్ పంపించాలని అనుకునే వారు https://nationalconvention1.theaaa.org/index.html వెబ్సైట్ లింక్ ద్వారా జనవరి 31, 2025 తేదీకల్లా తమ మూవీస్ పంపించవచ్చు. ఆడియన్స్ తమ పోల్ ను ఫిబ్రవరి 15, 2025 నుంచి మార్చి 28, 2025 వరకూ చేసే అవకాశం ఉంటుంది.
రీల్స్ పంపించాలని అనుకునేవారు https://nationalconvention1.theaaa.org/index.html వెబ్సైట్ ద్వారా జనవరి 31, 2025 వరకూ ఎంట్రీలు పంపించవచ్చు. ఆడియన్స్ తమ పోల్ ను ఫిబ్రవరి 15, 2025 నుంచి మార్చి 28, 2025 వరకూ చేసే అవకాశం ఉంటుంది.
AAA Mahaa Sabhalu: మ్యూజిక్ పోటీల కోసం మ్యూజిక్ పంపించే అవకాశం ప్రారంభం అయింది. జనవరి 31 వరకూ మీ మ్యూజిక్ పంపించవచ్చు. ఆడియన్స్ తమ పోల్ ను ఫిబ్రవరి 1, 2025 నుంచి మార్చి 28, 2025 వరకూ చేసే అవకాశం ఉంటుంది. మ్యూజిక్ ఈవెంట్ మార్చి 28, 2025 అలాగే మార్చి 29, 2025 తేదీల్లో నిర్వహిస్తారు.
ఇన్నీ చెప్పుకున్నాం కదా అసలు ఈవెంట్ ఎప్పుడు ఉంటుందనేది కూడా తెలుసుకుందాం. మర్చి 28, 29 తేదీల్లో 1వ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు నిర్వహిస్తారు. అమెరికాలో ఫిలడెల్ఫియ ఎక్స్ పో సెంటర్, వోక్స్, ఫిలడెల్ఫియా వద్ద ఈ మహా సభలు ఉంటాయి.